భక్తురాలి మెడలో బంగారం చోరీ
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ఓ భక్తురాలి మెడలోని మూడు కాసుల నానుతాడును గుర్తు తెలియని వ్యక్తి శనివారం తస్కరించాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉండి మండలం నరసింహరాజపుర అగ్రహారానికి చెందిన ముద్దన సీతామహలక్ష్మి ద్వారకాతిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. తిరుగుప్రయాణంలో బస్టాండ్‌లో బస్సు ఎక్కారు. బస్సు రోడ్డు పైకి వచ్చేసరికి బాధితురాలికి తన మెడలోని నానుతాడు, సూత్రాలు కనిపించలేదు. దాంతో కంగారుగా బస్సు దిగి బస్టాండ్‌లోకి వెళుతుండగా, ఎదురొచ్చిన ఆర్టీసీ కంట్రోలర్ సూత్రాలు దొరికాయని ఆమెకు ఇచ్చారు. అయితే నానుతాడు పోవడంతో ఆమె లబోదిబోమంటూ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ అర్హత సాధించాలనడం హేతుబద్ధంగా లేదని, టెట్ నుంచి మినహాయించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణను కోరారు. శనివారం ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు.


