మంత్రి శంకుస్థాపన పనులకు మోక్షం ఎప్పుడు?
యలమంచిలి: మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడచినా ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంపై టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ అధ్యక్షతన సోమవారం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ సమీక్ష జరుగుతుండగా కాజ పడమర గ్రామంలో ఉపాధి హామీ పథకంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఆరు నెలల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారని ఇంత వరకు పని ప్రారంభించలేదని ఎంపీటీసీ సభ్యుడు రత్నంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊటాడ సర్పంచ్ కొక్కిరిగడ్డ రాజేంద్ర తమ గ్రామంలో జల జీవన్ మిషన్ పనులు సగం చేసి వదిలేశారని ఆరోపించారు. మేడపాడులో పీహెచ్‌సీ పనులు సగంలోనే నిలిపివేయడంపై ఎంపీటీసీ డేగల సూర్యప్రభ నిరసన వ్యక్తం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
