టెట్‌ నుంచి మినహాయించాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయించాలి

Nov 4 2025 6:48 AM | Updated on Nov 4 2025 6:48 AM

టెట్‌

టెట్‌ నుంచి మినహాయించాలి

టెట్‌ నుంచి మినహాయించాలి రెస్టారెంట్ల తనిఖీ పాత కేసులో నలుగురి అరెస్టు

భీమవరం: ఉపాధ్యాయులను టెట్‌ పరీక్ష నుంచి మినహాయించాలని విద్యా శాఖ చెప్పడం భావ్యం కాదని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ విజయరామరాజు అన్నారు. ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం సూపరింటెండెంట్‌ తిరుపతి రాజుకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టపరమైన మార్పులతో ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలిపారు. సెక్రటరీ జనరల్‌ జి.ప్రకాశం మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యావ్యవస్థకు వెన్నెముకని చెప్పారు. ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తణుకు అర్బన్‌: మార్కెట్‌లో ‘మటన్‌ మంచిదేనా’ శీర్షికతో సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పశువైద్యులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ స్పందించారు. ఏలూరు అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ కె.వెంకటరత్నం, భీమవరం ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ శ్రీధర్‌రెడ్డి అత్తిలిలోని హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్తిలిలో రెండు హాటల్స్‌లో తనిఖీలు చేసి ఆహార పదార్థాల శాంపిల్స్‌ తీసుకున్నామని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు చెప్పారు. వ్యాపారులు ఆహార పదార్థాలకు సంబంధించి రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌ వాడొద్దని, ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించినట్లు చెప్పారు. అర్బన్‌ ప్రాంతాల్లోని కబేలాల్లో రోజూ మాంసాన్ని పరిశీలించి స్టాంప్‌ వేసిన తరువాతే మార్కెట్‌లో అమ్మకానికి అనుమతినిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో శాసీ్త్రయంగా తగిన కబేళా ఏర్పాటు లేకపోవడంతో కొన్నిచోట్ల మాంస విక్రయదారులు చనిపోయిన, జబ్బుపడిన జీవాలను మాంసం కోసం వధించడం చట్టరీత్యా శిక్షార్హమని పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌కే సుధాకర్‌ అన్నారు. పశు వైద్యాధికారులు గ్రామాల్లో పంచాయతీ సిబ్బందితో కలిసి మాంసం విక్రయదారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

నరసాపురం రూరల్‌: మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నరసాపురం మండలం తూర్పుతాళ్ళులో గతేడాది శ్రీదుర్గా జ్యూయలరీ షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నయీం విలేకర్ల సమావేశం నిర్వహించారు. చోరీకి పాల్పడిన వారి నుంచి 666 గ్రాముల బంగారం, 2.638 కిలోల వెండి, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాలకు చెందిన చిలకలపల్లి శివాజీ, ముత్యాల వరుణ్‌, సిద్ధిరెడ్డి మనోజ్‌ కిరణ్‌, సిద్దిరెడ్డి సంతోష్‌ కిరణ్‌ను అరెస్టు చేశామని, చెడు వ్యసనాలకు బానిసై ఈ చోరీకి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. వీరి నుంచి చోరీ సొత్తును పట్టణానికి చెందిన రిషబ్‌ జైన్‌, జవ్వాది శ్రీనివాస్‌, జి.శ్రీనివాస్‌ కల్యాణ కుమార్‌ కొనుగోలు చేశారన్నారు. ఈ సాత్తులో 71 శాతం వీరి నుంచి రికవరీ చేశామన్నారు. కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ ప్రసంశా పత్రాలను అందించారు.

టెట్‌ నుంచి మినహాయించాలి  
1
1/2

టెట్‌ నుంచి మినహాయించాలి

టెట్‌ నుంచి మినహాయించాలి  
2
2/2

టెట్‌ నుంచి మినహాయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement