డాక్టర్‌ వెంపటాపునకు కళా గౌరవ్‌ సమ్మాన్‌ | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ వెంపటాపునకు కళా గౌరవ్‌ సమ్మాన్‌

Nov 4 2025 6:48 AM | Updated on Nov 4 2025 6:48 AM

డాక్టర్‌ వెంపటాపునకు కళా గౌరవ్‌ సమ్మాన్‌

డాక్టర్‌ వెంపటాపునకు కళా గౌరవ్‌ సమ్మాన్‌

డాక్టర్‌ వెంపటాపునకు కళా గౌరవ్‌ సమ్మాన్‌ ట్రిపుల్‌ ఐటీల నిర్వహణకు రూ.200 కోట్లు బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

తణుకు అర్బన్‌: మన సంస్కృతి పేరిట విజయవాడ ఆర్ట్‌ అసోసియేషన్‌ గిల్డ్‌ బాలోత్సవ్‌ భవన్‌లో ఈ నెల 2న నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో తణుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్‌ వెంపటాపు ‘నమో అంతర్ముఖి’ శీర్షికతో చిత్ర రచన చేసి అభినందనలు అందుకున్నారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ బరేలీకి చెందిన కళా రత్నం ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సొసైటీ ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఆన్‌లైన్‌ ఆర్ట్‌ కాంపిటేషన్‌లో వెంపటాపు ‘కళా గౌరవ్‌ సమ్మాన్‌’ అవార్డును అందుకున్నట్లు చెప్పారు.

నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల నిర్వహణకు ఏడాదికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు కోసం టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. మెస్‌ల నిర్వహణ హరేకృష్ణ మూమెంట్‌ సంస్థకు అప్పగించామని.. గతంలో మాదిరిగా విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. నిర్వహణ సరిగా లేకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామన్నారు. నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు డైరెక్టర్లు, ఆర్జీయూకేటీ వీసీ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని తెలిపారు.

పాలకోడేరు: పాలకోడేరు మండలంలోని మోగల్లుకు చెందిన కొప్పినీడి విజయ లలిత( 23) బిడ్డను ప్రసవించి మరుసటి రోజు మరణించింది. ఈ నెల 29న డెలివరీ కోసం భీమవరంలోని మిషన్‌ హాస్పిటల్‌లో చేరారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని గాయత్రి ప్రైవేట్‌ హాస్పటల్‌ సిఫార్సు చేశారు. ఈ నెల 31న హాస్పటల్‌లో చేరగా.. రెండున బాబుకు జన్మనిచ్చింది. సోమవారం సాయంత్రం తల్లి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత చనిపోయిందని బంధువులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement