మాల ధారణం.. సన్మార్గ సోపానం | - | Sakshi
Sakshi News home page

మాల ధారణం.. సన్మార్గ సోపానం

Nov 4 2025 6:48 AM | Updated on Nov 4 2025 6:48 AM

మాల ధ

మాల ధారణం.. సన్మార్గ సోపానం

సేవా భావం అలవడుతుంది

ప్రత్యేక జీవన విధానం

బుట్టాయగూడెం: అయ్యప్ప స్వామి దీక్ష క్రమబద్ధమైన జీవన విధానం నేర్పే భక్తి మార్గం. దురలవాట్ల నుంచి విముక్తి కలిగించి క్రమశిక్షణ వైపు నడిపించే ఆధ్యాత్మిక మార్గం. భక్తి నియమ నిబంధనలే ప్రామాణికంగా సాగుతున్న అయ్యప్పస్వామి మాలధారణకు ఏటా ప్రాముఖ్యత పెరుగుతోంది. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో మాలాధారణ ఎక్కువగా చేస్తారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మందికి పైగా స్వామి మాల ధరించినట్లు సమాచారం. దీక్ష చేపట్టిన స్వాములు రాజమండ్రి సమీపంలో ఉన్న ద్వారపూడి, జంగారెడ్డిగూడెం సమీపంలోని గుర్వాయిగూడెం వద్దనున్న అయ్యప్పస్వామి ఆలయాల్లో స్వామికి ఇరుముడులు చెల్లించి దీక్షలు విరమిస్తారు. అత్యధికం శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శిచుకుని దీక్షను విరమిస్తారు. ఈ నెల 18న మండల దీక్ష కోసం వెళ్తున్నారు. మరికొందరు స్వాములు జనవరి 14న జ్యోతి దర్శనానికి బయల్దేరతారు. ప్రస్తుతం మండల, మకర జ్యోతి దర్శనం కోసం కార్తీకమాసం ఆరంభం నుంచి దీక్షలు చేపట్టిన స్వాములు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. 41 రోజులపాటు కఠోర దీక్ష చేస్తారు. బ్రహ్మచర్యం, చన్నీటి స్నానం, దీపారాధనలు, అయ్యప్ప శరణ ఘోష, సాత్వికాహారంతో భక్తులు ముందుకు సాగుతారు. ఈ ఏడాది దీక్ష స్వీకరించిన వారిలో 30 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారు 50 శాతం ఉంటే వీరిలో యువకులు 30 శాతం వరకూ ఉన్నట్లు తెలుస్తుంది.

అయ్యప్ప దీక్ష నియమాలు

● రోజూ వేకువనే మేల్కొని చన్నీటి స్నానం చేయాలి.

● స్నానానికి ముందు మంచి నీరు తాగరాదు.

● మంత్ర మాలను ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు.

● శబరిమల వెళ్లే భక్తులు 41 రోజుల దీక్షను కచ్చితంగా పాటించాలి.

● సన్నిధానంలో పదునెట్టంబడి ఎక్కే సమయానికి 41 రోజులు పూర్తి కావాలి.

● నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి(మొదటి సారి దీక్ష స్వీకరించిన కన్నె స్వాములు కచ్చితంగా నలుపు దుస్తులను ధరించాలి)

● కాళ్లకు చెప్పులు ధరించకూడదు.

● ప్రతీ సీ్త్రని దేవీ స్వరూపులుగా భావించాలి.

● తన పేరు చివర అయ్యప్పను కలుపుకోవాలి.

● దీక్ష కాలంలో ముఖ క్షవరం, కేశ ఖండన, గోళ్లు తీసుకోకూడదు. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించకూడదు.

● రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి.

● ఉదయం పాలు, పళ్లు మాత్రమే ఆరగించాలి. అల్పాహారం తినకూడదు.

● మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించకూడదు. నేలమీద చాపపై విశ్రమించాలి.

● పగటిపూట నిద్రపోకూడదు, ఎల్లప్పుడూ విభూతి, చందనం, కుంకుమ బొట్టుతో ఉండాలి.

● మద్యం, మాంసం, ధూమపానం, తాంబూలం నిషేదం.

కఠిన నియమాలే జీవిత ఉన్నతికి మార్గం

దీక్షా నియమాలతో వ్యక్తిత్వ వికాసం సొంతం

జిల్లాలో ఏటా పెరుగుతున్న అయ్యప్ప దీక్షాధారులు

ఈ ఏడాది సుమారు 18 వేల మంది దీక్షలు చేపట్టిన స్వాములు

స్వాముల పేర్లు ఇలా..

క్రమం తప్పకుండా ఏటా దీక్ష చేపట్టే భక్తులను పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు.

కన్నెస్వామి– మొదటి సారి దీక్ష

కత్తి స్వామి– రెండో సారి దీక్ష

గంట స్వామి– మూడో సారి దీక్ష

గదస్వామి– నాల్గో సారి దీక్ష

పెరుస్వామి– ఐదో సారి దీక్ష

గురుస్వామి– ఆరో సారి దీక్ష

అన్నప్రసాదం: అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు కొంత మంది సొంతంగా వండుకుంటారు. సాధ్యం కాని వారి కోసం అయ్యప్పస్వామి ఆలయ కమిటీలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

ఇరుముడికి అత్యంత ప్రాధాన్యం

దీక్షలో 41 రోజుల తర్వాత చేసే ఇరుముడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇరు అంటే రెండు అని అర్థం. అనగా రెండు ముడులు. మొదటి ముడిలో పీఠం, భస్మం, గంధం, కొబ్బరికాయలు, నెయ్యి, పూజా సామాగ్రి ఉంటాయి. రెండవ ముడిలో ప్రయాణానికి కావాల్సిన వస్తువులు ఉంటాయి.

శబరిమలకు ఆర్టీసీ బస్సులు

దీక్షదారులు ఒక బృందంగా ఏర్పడి ఆర్టీసీ లేదా ప్రెవేటు బస్సులను సంప్రదిస్తే శబరిమలకు బస్సు సౌకర్యం కల్పిస్తారు. కిలోమీటర్‌ ప్రకారం చార్జీలు వసూలు చేస్తారు. ప్రైవేటు ట్రావెల్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీల ప్రకారం ప్రత్యేక బస్సులు నడుపుతారు.

ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి రైలు అత్యంత తక్కువ ఖర్చుతో కూడింది. విజయవాడ నుంచి కొట్టాయం మీదుగా చెంగులూరు స్టేషన్‌లో దిగి కేరళ ఆర్టీసీ బస్సులు, స్వాములను పంపా నది, ఎరిమేలి, తదితర ప్రాంతాలకు తీసుకు వెళ్లేదుకు సిద్ధంగా ఉంటాయి.

విమాన ప్రయాణం

శబరిమలకు విమానం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంది. గన్నవరం, హైదరాబాదులోకి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొచ్చిన్‌ వెళ్లొచ్చు. లేదా బెంగుళూరు నుంచి కొచ్చిన్‌ వెళ్లొచ్చు.

నేను సుమారు 8 సంవత్సరాల నుంచి దీక్షను స్వీకరించి శబరిమలకు వెళ్తున్నాను. 30 మంది బృందంగా ఏర్పడి దీక్షను ఆచరిస్తున్నాం. అయ్యప్ప దీక్ష వల్ల చక్కటి సేవా భావం ఏర్పడుతుంది.

కంభంపాటి గంగరాజు, అయ్యప్ప మాలధారి, బుట్టాయగూడెం

దీక్షలో ఉన్నన్ని రోజులూ జీవన విధానంలో ప్రత్యేకత ఉంటుంది. నియమ నిష్టలతో నిత్యం అయ్యప్పను స్మరించాలి. ఉదయం, సాయంత్రం ఆలయంలో పూజ చేయడంతో ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుంది.

దండాబత్తుల ఫణికుమార్‌, అయప్ప మాలధారి, బుట్టాయగూడెం

మాల ధారణం.. సన్మార్గ సోపానం1
1/2

మాల ధారణం.. సన్మార్గ సోపానం

మాల ధారణం.. సన్మార్గ సోపానం2
2/2

మాల ధారణం.. సన్మార్గ సోపానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement