కలానికి సంకెళ్లపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

Oct 18 2025 9:51 AM | Updated on Oct 18 2025 9:51 AM

కలాని

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

● ప్రభుత్వానికి భజన చేయాలా? సాక్షిపై కూటమి కక్ష మీడియాతో చెలగాటం మీడియాపై వేధింపులు తగదు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు రాజ్యాంగ విరుద్ధంగా.. ప్రజాస్వామ్యానికి కళంకం అందరూ ఖండించాలి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ..

కూటమి ప్రభుత్వం మీడియాను కట్టుబానిసలుగా చూస్తోంది. తమకు అనుకూలంగానే రాయాలనే ధోరణితో అనుకూల మీడియాను అందలమెక్కించి ప్రజల పక్షాన నిలిచే మీడియాను అణగదొక్కాలని కుట్రలు చేస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా, మీడియా వ్యతిరేక విధానాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.

– గాదిరాజు రామరాజు,

వైఎస్సార్‌సీపీ భీమవరం పట్టణ అధ్యక్షుడు

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షి మీడియాపై కూటమి కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. నకిలీ మద్యం, మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారన్న అక్కసుతో సాక్షిని కట్టడి చేయాలని చూస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పోకడలు సరికాదు.

–బంధన పూర్ణచంద్రరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌

కూటమి ప్రభుత్వం మీడియాతో చెలగాటమాడుతోంది. తాము చెప్పిందే రాయాలి, ప్రచారం చేయాలనే ధోరణి మంచిది కాదు. అక్రమాలు, అవకతవకలు జరిగినప్పుడు బయటపెట్టడం మీడియా బాధ్యత. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరించడం మంచిది కాదు.

– చిగురుపాటి సందీప్‌,

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా కన్వీనర్‌

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే అక్కసుతో కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు సరికాదు. కల్తీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమి నాయకులను దుమ్మెత్తిపోస్తుంటే.. కల్తీ మద్యంలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్న సాక్షిపై దాడులు, నిర్బంధాలు దారుణం.

– బి.వాసుదేవరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు, అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు వంటిది. సమాజంలో అక్రమాలు, అన్యాయాలను వెలికితీసే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్న మీడియాను అడ్డుకోవాలని చూడటం దారుణం. సాక్షి పత్రికపై దాడులు, నిర్బంధాలను ప్రజలు సహించరు.

– యర్రంశెట్టి గిరిజాపతి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యుడు

సాక్షి, భీమవరం: నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు ‘సాక్షి’పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను ప్రజా, జర్నలిస్ట్‌ సంఘాలు ఖండించాయి. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతులు అందజేశారు. భీమవరంలో ఏపీయూడబ్ల్యూజే, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, దళిత ఐక్యవేదిక సంఘాల నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు. మీడియాపై దాడులు ఆపాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, విలేకర్లపై నిర్బంధాలను అరికట్టాలని నినాదాలు చేశారు. డీఎస్పీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఏపీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వీఎస్‌ సాయి బాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్‌, గుంటి ప్రభు, గంటా సుందరకుమార్‌, బి.వాసుదేవరావు, చెల్లబోయిన రంగారావు, మల్లుల శ్రీనివాసరావు, ఎం.వైకుంఠరావు, ఎం.ఆంజనేయులు, డి.నాగు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్‌, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ బంధన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని పోలీసులను పత్రికా కార్యాలయాలకు పంపి ఎడిటర్‌, జర్న లిస్టులను వేధింపులకు గురి చేయడం రాజ్యాంగ విరుద్ధం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగే రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. సాక్షిపై కక్ష సాధింపు చర్యలను ఆపాలి.

– కామన మునిస్వామి, ఆల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి కళంకం తెస్తోంది. కల్తీ మద్యం విక్ర యాలు, దాని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే వివరాలను ప్రజల ముందుకు తీసుకురావడంతోనే సాక్షిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలి.

– చెల్లబోయిన రంగారావు,

సీపీఐ పట్టణ కార్యదర్శి, భీమవరం

నిజాన్ని నిర్భయంగా బయటపెడుతున్న సాక్షిపై ప్రభుత్వం జులుం ప్రదర్శించడం మంచిది కాదు. సాక్షిపై కూటమి ప్రభుత్వం అకారణంగా కేసులు పెడుతూ వేధిస్తున్న వైనాన్ని అందరూ ఖండించాలి. ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్యంలో పత్రికలకు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

– గుంటి ప్రభు, వైఎస్సార్‌సీపీ

రాష్ట్ర ఆర్‌టీఐ వింగ్‌ సెక్రటరీ

రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సాక్షి మీడియాలో వచ్చిన వరుస కథనాలకు బెంబేలెత్తిన కూటమి ప్రభుత్వం సాక్షిని అణచివేయాలని పోలీసులను ఉసిగొల్పడం దారుణం. పత్రికా స్వేచ్ఛను హరించేలా ఇలాంటి చర్యలు దుర్మార్గం.

– గంటా సుందర్‌కుమార్‌,

దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

తణుకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ నారాయణకు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.

పాలకొల్లులో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌ ఎన్‌.దుర్గకు వినతిపత్రం సమర్పించారు.

తాడేపల్లిగూడెంలో ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్‌క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి ఆర్‌ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.

ఉండి నియోజకవర్గం ఆకివీడులో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పాత్రికేయులు ధర్నా చేశారు. అనంతరం ఆర్‌ఐ వి.ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు.

కక్ష సాధింపుపై గర్జన

కూటమి ప్రభుత్వ తీరును ఖండించిన ప్రజా, జర్నలిస్ట్‌ సంఘాలు

‘సాక్షి’పై దాడులను ఆపాలని డిమాండ్‌

జిల్లావ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు

అధికారులకు వినతిపత్రాలు అందజేత

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 1
1/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 2
2/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 3
3/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 4
4/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 5
5/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 6
6/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 7
7/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 8
8/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 9
9/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 10
10/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 11
11/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

కలానికి సంకెళ్లపై కన్నెర్ర 12
12/12

కలానికి సంకెళ్లపై కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement