
ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు
జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి
భీమవరం: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలులో రై తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికా రులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, సహకార, రవాణా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. త్వరలో ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న దృష్ట్యా సత్వర ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న గోనె సంచులు, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ సమయంలో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. అలాగే రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఎస్‌ఓ ఎన్.సరోజ, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండీ ఇబ్రహీం, జిల్లా సహకార శాఖ అధికారి సంకు మురళీకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి ఎంవీ కృష్ణారావు, ఏఎస్‌ఓ ఎం.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.