
యథేచ్ఛగా ఇసుక అరకమ రవాణా
అరకమ రవాణాను అరికట్టాలి
● చింతలపూడి కేంద్రంగా తెలంగాణకు..
● నిబంధనలు మీరి తరలింపు
చింతలపూడి: చింతలపూడి కేంద్రంగా ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మండల సరిహద్దు గ్రామాలను కేంద్రంగా చేసుకుని రాత్రి వేళల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు లారీలు, టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. చెక్ పోస్ట్‌లను తప్పించుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సాగుతున్నట్టు సమాచారం. దీంతో ఇసుక అక్రమ రవాణాకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. కొవ్వూరు, తాళ్లపూడి నుంచి ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. ఈ నేపథ్యంలో కొవ్వూరు, తాళ్లపూడి ఇసుక రీచ్‌లలో చింతలపూడికి సంబంధించిన లారీలకు ఇసుక లోడింగ్‌కు నిరాకరించడంతో ఇక్కడి లారీ యజమానులు గత వారం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇక్కడి లారీలకు కూడా ఇసుక లోడింగ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం ఇసుక తెలంగాణ నుంచి వచ్చిన లారీల్లో పక్క రా ష్ట్రానికి తరలిపోతున్నట్టు స్థానిక లారీ యజమాను లు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ చెక్ పోస్టుల ద్వారా నిఘా పెట్టినా ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. గత నెల 4న పోలీసులు తెలంగాణకు తరలిపోతున్న సుమారు 16 లారీలను చింతలపూడిలో పట్టుకుని సీజ్ చేశారు. అప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దా డులు చేసి ఈనెల 9న రాత్రి ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి మండలంలో తనిఖీలు నిర్వహించి మరో 5 లారీలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదుచేశారు. సరిహద్దు గ్రామాల పేరుమీద బిల్లు తీసుకుని తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. ఇసుకను స్థానిక లారీలకు మాత్రమే సరఫరా చేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్నారు.
స్థానికంగా లభ్యమయ్యే గోదా వరి ఇసుకను స్థానిక లారీలకు లోడింగ్ చేయడం వల్ల జిల్లాలో ఇసుక కొరత ఉండదు. అధికారులు ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
– త్సల్లాబత్తుల శ్రీనివాసరావు,
వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు

యథేచ్ఛగా ఇసుక అరకమ రవాణా