ఆటో కార్మికుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

ఆటో కార్మికుల ధర్నా

Oct 18 2025 9:51 AM | Updated on Oct 18 2025 9:51 AM

ఆటో క

ఆటో కార్మికుల ధర్నా

ఆటో కార్మికుల ధర్నా 23 నుంచి కార్తీక మాసోత్సవాలు పుష్కరిణిలో చెత్త తొలగింపు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నృసింహ సాగరం (పుష్కరిణి) ఒడ్డున పేరకుపోయిన చెత్తను దేవస్థానం సిబ్బంది తొలగించారు. అలాగే మెట్లను శుభ్రం చేశారు. ఈనెల 13న ‘సాక్షి’లో ‘మందుబాబులకు అడ్డాగా.. శ్రీవారి పుష్కరిణి’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పుష్కరణిలో పారిశుద్ధ్య పనులు చేపట్టి మెట్లపై ఉన్న బీరు సీసాలు, కాల్చిపడేసిన సిగరెట్లను తొల గించారు. ఒడ్డున పేరుకుపోయిన చెత్తను తొలగించి, శుభ్రం చేశారు. అయితే నీరు మురుగుతో దుర్వాసన వెదజల్లుతుండటంతో కార్తీక మాసంలో భక్తులు అందులో స్నానాలు ఆచరించే వీలు లేకుండా ఉంది. కనీసం పుష్కరిణి ప్రాంతంలో లైట్లు ఏర్పాటు చేస్తే మెట్లపై, కార్తీక దీపాలు వెలిగించేందుకు, పుష్కరిణిలో దీపాలు వదిలేందుకు అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. బాలికా దినోత్సవం

భీమవరం: ఉచిత బస్సు ప్రయాణం కారణంగా నష్టపోతున్న ఆటో కార్మికులకు రూ.30 వేలు ఆర్థిక సాయం చేయాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కర్రా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో ఆటో కార్మికుల ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2.90 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం సాయం అందించిందన్నారు. నెలకు ఆటో డ్రైవర్‌ రూ.20 వేలు సంపాదిస్తాడని ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల ఇస్తున్నామని గొప్పలు చెప్పు కోవడం సిగ్గుచేటన్నారు. ఓటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెడితే చాలా మంది నష్టపోతారన్నారు. ఆటో వర్కర్స్‌ యూ నియన్‌ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయ ణ మాట్లాడుతూ ఆటో కార్మికులందరికీ న్యా యం చేయాలని లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు బి.వాసుదేవరావు, పీవీ ప్రతాప్‌, ఎం.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం ( ప్రకాశం చౌక్‌): భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం (సోమారామం)లో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థానంలో ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పు లపర్తి రామాంజనేయులు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మొబైల్‌ టాయిలెట్స్‌, మంచినీరు, మెడికల్‌ క్యాంపులు తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. దేవస్థానం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌కు, ట్రా ఫిక్‌ సమస్య లేకుండా చూడాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. జిల్లా దేవదాయశాఖ అధికారి సూర్యప్రకాష్‌, ఈఓ డి.రామకృష్ణంరాజు, దేవస్థానం చైర్మన్‌ బంగారురాజు, ట్రస్ట్‌ బోర్డ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాలికలు అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గవరవరం సెంట్‌ ఆన్స్‌ మహిళా కళాశాలలో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్య అనే ఆయుధంతో ప్రతి బాలిక ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.

ఆటో కార్మికుల ధర్నా 1
1/3

ఆటో కార్మికుల ధర్నా

ఆటో కార్మికుల ధర్నా 2
2/3

ఆటో కార్మికుల ధర్నా

ఆటో కార్మికుల ధర్నా 3
3/3

ఆటో కార్మికుల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement