
నమ్మించి.. నట్టేట ముంచారు
న్యూస్‌రీల్
నాడు ఇళ్లు ఉచితమని భరోసా
రుణగ్రస్తులను చేసింది టీడీపీ నేతలే..
చిచ్చర పిడుగులు
ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి స్కేటింగ్ పోటీలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు చిచ్చర పిడుగుల్లా దూసుకుపోయారు. 8లో u
ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 8లో u
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పాలకొల్లు సెంట్రల్: అధికారం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేయడం.. తీరా గద్దెనెక్కిన తర్వాత వాటి నుంచి తప్పించుకోవడానికి అసత్య ప్రచారం, ఎదురుదాడి కూటమి నేతలకు పరిపాటిగా మారింది. నాడు టిడ్కో లబ్ధిదారులు బ్యాంకు వాయిదాలు కట్టదంటూ చెప్పిన ప్రజాప్రతినిధులు.. నేడు కట్టాల్సిందేనంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతల హామీలను నమ్మిన లబ్ధిదారులు నేడు లబోదిబోమంటున్నారు. ఇటీవల పాలకొల్లు నియోజకవర్గంలోని పెంకుళ్లపాడు టిడ్కో గృహాల వద్దకు బ్యాంకు అధికారులు వచ్చి బ్యాంకు వాయిదాలు చెల్లించాలని.. లేకుంటే ఫ్లాట్లకు తాళాలు వేస్తామని హెచ్చరించడంతో ఆందోళన చెందుతున్నారు.
ఇష్టానుసారం హామీలు.. లబ్ధిదారులకు శాపాలు
అధికారం కోసం గత ఎన్నికల ప్రచారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడుతో సహా టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇష్టానుసారంగా టిడ్కో గృహాలపై హామీలు ఇచ్చారు. వీరి హామీలను నమ్మిన లబ్ధిదారులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించడం మానేశారు. దాని పర్యావసానం నేడు వడ్డీలతో సహా తలకు మించిన భారమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు భరోసా ఇవ్వాల్సింది పోయి బ్యాంకు వాయిదాలు కట్టేసుకోండని అంటున్నారు.
తప్పును కప్పిపుచ్చుకునేందుకు..
తాజాగా టిడ్కో ఇళ్ల వద్దకు బ్యాంకు అధికారులు వచ్చినప్పుడు పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా వారిలో కొందరు టీడీపీ అభిమానులు ఉన్నారు. ఈ సంఘటన ప్రచారం ఎక్కువ కావడంతో టీడీపీ నేతలు పలు స్క్రిప్టులు సిద్ధం చేశారు. కొందరు లబ్ధిదారులకు తర్ఫీదునిచ్చి ఇదంతా జగన్ ప్రభుత్వం తప్పిదమని, తమ బ్యాంకు రుణాలను గత ప్రభుత్వం వాడేసుకుందని వీడియోలు ద్వారా తప్పుగా చెప్పించారు. ఇదిలా ఉండగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణాలన్నీ రద్దు చేస్తామని, ఉచితంగా ఇళ్లు ఇచ్చి శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేయిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, నిమ్మల లబ్ధిదారులను నమ్మించారు. ఇప్పటికీ రెండు శ్రావణాలు దాటినా ఈ హామీని ఎందుకు అమలు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లోన్లు కట్టాలంటున్న మంత్రి
నెల క్రితం మంత్రి నిమ్మల ఇది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికీ తిరిగారు. ఆ సమయంలో పలువురు మహిళలు టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు.. బ్యాంకు లోన్లు కట్టవద్దన్నారు.. ఇప్పుడు బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు.. అంటూ మంత్రిని ప్రశ్నించారు. దీంతో బ్యాంకు లోన్లు కట్టేసుకోవాలి.. అవి ఆగవు కదా.. అని మంత్రి చల్లగా సెలవిచ్చారు. ఈ మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే తమకు వడ్డీ బాధలైనా తప్పేవి కదా అంటూ లబ్ధిదారులు వాపోతున్నారు.
2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేటగిరీ–1 లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి అప్పగించారు. కేటగిరీ–2, కేటగిరీ–3 లబ్ధిదారుల్లో కొందరు బ్యాంకు వాయిదాలు చెల్లించారు. అయితే కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు కట్టలేకపోయారు. 2023లో ఇదే అదనుగా అప్పటి ఎమ్మెల్యే నిమ్మల లబ్ధిదారులను బ్యాంకులకు తీసుకువెళ్లి అధికారులను ప్రశ్నించారు. నిబంధనలు పాటించాల్సిందేనని బ్యాంకు అధికారులు చెప్పడంతో వాయిదాలు చెల్లించకండి.. బ్యాంకు అధికారులు వస్తే కట్టమని చెప్పండి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు రుణాలు రద్దవుతాయని ఆశించారు. అయితే ప్రస్తుతం మంత్రి నారాయణతో సహా స్థానిక ప్రజాప్రతినిధి బ్యాంకు రుణాలు కట్టుకోవాలని చెప్పడంతో ఆవేదన చెందుతున్నారు.
గూడు..గోడు
నాడు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని కూటమి నేతల హామీ
బ్యాంకు వాయిదాలు కట్టొద్దంటూ సూచన
నేడు వాయిదాలు కట్టాల్సిందేనని సన్నాయి నొక్కులు
హామీల నుంచి తప్పించుకునేందుకు అసత్య ప్రచారం
బ్యాంకు అధికారుల హెచ్చరికలతో లబ్ధిదారుల బెంబేలు
నాలుగు రోజుల క్రితం టిడ్కో గృహాల వద్దకు బ్యాంకు అధికారులు వచ్చి వాయిదాలు, వడ్డీలు చెల్లించాలని లేకుంటే నోటీసులు పంపించి ఫ్లాట్లకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు టీడీపీ నేతలే కారణమని అర్థమవుతుంది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఫ్లాట్లు ఇచ్చినప్పుడే బ్యాంకు రుణాలు అంశాన్ని తీసుకువచ్చారు. కేటగిరీ–1 ఫ్లాట్‌కు రూ.2.82 లక్షలు, కేటగిరీ–2 ఫ్లాట్లకు రూ.3.18 లక్షలు, కేటగిరీ–3 ఫ్లాట్లకు రూ.3.58 లక్షలు బ్యాంకు రుణంగా నిర్దేశించారు. ఈ మేరకు పాంప్లెట్‌లు కూడా పంచారు. ఇలా లబ్ధిదారులను బ్యాంకుల్లో రుణగ్రస్తులను చేసింది టీడీపీ నేతలు కాగా.. వీటిని మరిచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే లబ్ధిదారులను బ్యాంకులో రుణగ్రస్తులను చేసిందని ఊపన్యాసాలతో ఊదరగొడుతున్నారు.

నమ్మించి.. నట్టేట ముంచారు