
చోరీకి యత్నించి.. దాడిలో గాయపడి..!
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్ పేట, కట్టా సుబ్బారావు వీధి ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా ఇంటి యజమాని అతడిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ గుర్తు తెలియని వ్యక్తిని ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఏలూరు టూటౌన్ ఏఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కట్టా సుబ్బారావు తోట ప్రాంతంలో వీరమాచినేని మృత్యుంజయబాబు తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 8న రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృత్యుంజయబాబు ఇంట్లోకి ప్రవేశించాడు. అతను చోరీ చేసేందుకు వచ్చాడా? మరే కారణామో తెలియదు గానీ... ఇంట్లోని వారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించగా, అతడి చేతిలోని బ్యాట్‌ను లాక్కున్న మృత్యుంజయబాబు అతడిపై దాంతో దాడి చేశాడు. ఈ దాడిలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. మెరుగైన చికిత్సకు వైద్యులు విజయవాడ రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతిచెందాడు. ఈ సంఘటనపై వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.