
ఎట్టకేలకు డ్రెయిన్ శుభ్రం
పెంటపాడు: మండలంలోని పరిమెళ్ల పంచాయతీలో మురుగునీటి పారుదలకు అధికారులు ఎట్టకేలకు సోమవారం చర్యలు తీసుకున్నారు. ఈనెల 12 న సాక్షి దినపత్రికలో చెత్త తొలగదు.. మురుగుపారదు అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సర్పంచ్ గొర్రెల కోటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి డి.నాగదేవిలు గ్రామంలో చెత్త, దుర్వాసనతో పేరుకుపోయిన పలు డ్రెయినేజీలు శుభ్రం చేయించారు. పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలలో ముగ్గు చల్లించారు.
ఉండి: అదనపు కట్నం కోసం భర్త,అత్తమామల వేధిస్తుండడంతో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం మండలంఓలని చెరుకువాడ గ్రామానికి చెందిన కొల్లిపర విజయలక్ష్మీకి హైదరాబాద్‌లో నివాసముంటున్న మామని ప్రసాద్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంత కాలం నుంచి భర్త,అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో పుట్టింటికి వచ్చిన సదరు మహిళ సోమవారం ఉండి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఏఎస్సై మోహన్‌రావు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎట్టకేలకు డ్రెయిన్ శుభ్రం