రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Oct 14 2025 6:45 AM | Updated on Oct 14 2025 6:45 AM

రైలు

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి కాలువలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య పారిజాతగిరి హుండీ ఆదాయం లెక్కింపు

భీమవరం: భీమవరం రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని సుమారు 60 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణం సోమవారం విలేకరులకు తెలిపారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, పర్పుల్‌ కలర్‌ లుంగీ దరించాడని పేర్కొన్నారు. ఆకివీడు రైల్వే స్టేషన్‌ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేశామని మృతుని ఆచూకీ తెలిసినవారు 94905 17982 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

తణుకు అర్బన్‌: తణుకు పైడిపర్రు కాలువలో గల్లంతైన బాలుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. తణుకు పట్టణానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బొమ్మబోయిన జోగేంద్ర నందు (13) స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వచ్చి కాలువలో పడి గల్లంతు అయిన విషయం తెలిసిందే. సోమవారం అత్తిలి మండలం గుమ్మంపాడు లాకుల వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తణుకు రూరల్‌ ఎస్సై కె.చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: మద్యం సేవిస్తున్న భర్తను భార్య మందలించడంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రూరల్‌ హెచ్‌సీ జిలానీ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోదుగగుంట గ్రామానికి చెందిన దండ్రు వెంకట్రావు (50) రోజూ మద్యం సేవించి ఇంటికి రావడంతో ఆదివారం భార్య వెంకటనర్సమ్మ నిలదీసింది. దీంతో వెంకట్రావు మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. అతనిని తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువు దండ్రు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ జిలానీ తెలిపారు.

జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఏలూరు దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ బాబు నాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో 90 రోజులకు గానూ రూ. 12,88,615 ఆదాయం వచ్చినట్లు ఈఓ కలగర శ్రీనివాస్‌ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, గొట్టుముక్కల భాస్కరరాజు, వాసవీ సాయి నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి  గుర్తు తెలియని వ్యక్తి మృతి 1
1/1

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement