
ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటేనే సేవా దృక్పథంతో పనిచేయగలవని, ప్రైవేటు వారికి అప్పగిస్తే వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తారని జన విజ్ఞాన వేదిక పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రమేష్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి అనే అంశంపై స్థానిక ఎన్‌ఆర్‌పేటలో జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పీపీపీ విధానం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ రవి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు రంగానికి ఉన్న అంతరాన్ని వివరిస్తూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఇతోధికంగా సేవ చేశాయన్నారు. రిటైర్డ్ జడ్జి అడబాల లక్ష్మి మా ట్లాడుతూ కాలేజీల్ని ప్రైవేట్‌పరం చేయడం అంటే రాజ్యాంగ విలువలకి పాతర వేయడమే అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్, సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.