
మెనూ ప్రత్యేకమే..
పుంజులో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. పుంజు బరువును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డు ముక్క లు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం ఎప్పటిమాదిరి చోళ్లు, గంటులు, మెరికలు మొదలైన వాటిని అందిస్తారు. పుంజు అనారోగ్యం, వైరస్‌ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు వేయించడం, మ రెన్నో సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు అవలంబించడం చేస్తుంటారు.