
ఎంటీఎస్ టీచర్లను క్రమబద్ధీకరించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): డీఎస్సీ–98 మినిమం టైం స్కేల్ టీచర్స్ (ఎంటీఎస్) విజ్ఞాపన దీక్ష రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్స్‌తో శనివారం విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద జరిగినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు కె.మోహన్‌రావు శనివారం తెలిపారు. దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి ఎంటీఎస్ టీచర్లు హాజరయ్యారన్నారు. ఎంటీఎస్‌పై పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరించాలని, మినిమం పెన్షన్ కల్పించాలని, అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చినట్లు వివరించారు.