
నాకో, ఏపీశాక్స్, రాష్ట్ర జైలు శాఖ సహకారంతోనే..
నాకో, ఏపీ శాక్స్, రాష్ట్ర జైలు శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 83 జైళ్లల్లో హెచ్‌ఐవీ, టీబీ, సుఖవ్యాధులు, హెపటైటిస్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేశాం. వ్యాధి నిర్ధారణైన వ్యక్తులకు అవసరమైన మందులను, ఆరోగ్య సదుపాయాలను అందిస్తున్నాం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, దిశ, జైళ్ల శాఖ సంయుక్త సహకారంతో ఈ కాార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
–ఎం రాధిక, లెప్రసొసైటీ సీనియర్ మేనేజర్, విజయవాడ