
శ్రీకృష్ణా సుజుకీలో దసరా ఆఫర్లు
ఏలూరు టౌన్: ఏలూరులోని శ్రీకృష్ణా సుజుకీ షోరూమ్‌లో దసరా వేడుకల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది. ఒకవైపు జీఎస్‌టీ తగ్గింపు, మరోవైపు శ్రీకృష్ణా సుజుకీ యాజమాన్యం నారా శేషు కొనుగోళ్లపై ఆఫర్లు ప్రకటించటంతో కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుజుకీ వాహనం కొనుగోళ్లపై సుమారు రూ.15వేల వరకూ జీఎస్‌టీ ఆదా అవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వీటితోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నాయి. ప్రతి సుజుకీ యాక్సెస్ కొనుగోలుపై రూ.3వేలు, అవినీస్ కొనుగోలుపై రూ.5వేలు క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని షోరూమ్ ప్రతినిధులు చెబుతున్నారు ప్రతి మోటారు సైకిల్ కొనుగోలుపై ఏకంగా రూ.20 వేల క్యాష్‌బ్యాక్ ఇస్తుండగా, డౌన్‌పేమెంట్ సైతం కేవలం రూ.5999 మాత్రమే ఉందని యజమాని నారా శేషు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరులోని తమ షోరూమ్స్‌లో ఆఫర్లు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
కై కలూరు: స్థానిక మాగంటి థియేటర్‌లో ఈ నెల 30న థియేటర్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసి, తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశామని కై కలూరు టౌన్ ఎస్సై డి.వెంకట్‌కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం కలిదిండి మండలం పడమటిపాలెంకు చెందిన పాము సూర్యకుమార్(23), గంగుల ధన్‌రాజ్(29), కలిదిండి హేమంత్‌కుమార్(30), కరేటి సాయికుమార్(23)లు మద్యం తాగి ప్రక్షుకులతో గొడవకు దిగారని పేర్కొన్నారు. టిక్కెట్లు డబ్బులు వాపసు ఇస్తామని బయటకు వెళ్లాలని థియేటర్ మేనేజర్ గణేష్, సిబ్బంది సుంకర వెంకటేశ్వరరావులు చెప్పారు. దీంతో అక్కడ శుభ్రం చేసే కర్రతో వీరిపై నలుగురు దాడి చేశారు. నిందితులను కై కలూరు తహసీల్దారు మందు హాజరుపర్చగా ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు బైండవర్ విధించినట్లు ఎస్సై చెప్పారు. యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్ బెయిల్‌పై పంపించామన్నారు.
ముదినేపల్లి రూరల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తలపై వివాహిత ఇచ్చిన ఫిర్యా దు మేరకు స్థానిక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని పెయ్యేరు శివారు అప్పారావుపేటకు చెందిన డి.ప్రియాంకకు పెడన మండలం కోటవానిపాలెం గ్రామానికి చెందిన పరసా శ్రీకాంత్‌తో 2018లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇచ్చిన లాంఛనాలతో పాటు అనంతరం మరికొంత నగదు ముట్టజెప్పారు. అయినప్పటికీ భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త శేషమ్మ అధిక కట్నం తేవాలని తరచూ శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కాపురానికి తీసుకువెళ్లడం లేదు. దీంతో బాధితురాలు ప్రియాంక పోలీసులను ఆశ్రయించింది.