
కాటన్ పార్కుకు మోక్షం
స్పందన
ఆకివీడు: కొల్లేరు ముఖద్వారంలో ఆకివీడులో ఉన్న కాటన్ పార్కుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల పార్కుకు ఆలనా పాలనా లేకపోవడంతో తుప్పలు, మొక్కలు పెరిగిపోయాయి. పర్యాటక శాఖ నిర్లక్ష్యం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీనిపై ఈనెల 4వ తేదీన ‘చిట్టడవిని తలపిస్తున్న కాటన్ పార్కు’ శీర్షికన కథనం ప్రచురించింది. అనంతరం పార్కు అభివృద్ధికి, మొక్కల తొలగింపు తదితర పనులకు రూ.2.80 లక్షలకు దుంపగడప గ్రామస్తుడు పిన్నమరాజు శ్రీనివాసరాజు కాంట్రాక్టు తీసుకున్నారు. ప్రస్తుతం పార్కులో మొక్కల తొలగింపు, తదితర పనులు చేపట్టారు. మరిన్ని నిధులు కేటాయించి విద్యుత్, మంచినీటి సౌకర్యంతో పాటు ఇరత్రా అభివృద్ధి పనులు చేపడితే పర్యాటకులు మరింత పెరిగి ఈ ప్రాంతానికి ఆదాయం చేకూరే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

కాటన్ పార్కుకు మోక్షం

కాటన్ పార్కుకు మోక్షం