
పేద బతుకులకు లేదు ధీమా
న్యూస్‌రీల్
శురకవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
పెన్నాడకు చెందిన ఒక యువకుడు అనారోగ్యంతో ఏడాది క్రితం మృతిచెందాడు. ఆయనకు భార్యాపిల్లలు ఉన్నారు. ఆయన భార్య స్థానికంగా క్లాత్ షాపులో పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం నుంచి బీమా పరిహారం కాని, పింఛన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
మోగల్లుకు చెందిన 41 ఏళ్ల వెంకటరత్నం వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం పొలంలో పురుగు మందులు పిచికారీ చేసే పనికి వెళ్లి మృతి చెందాడు. వెంకటరత్నం మృతితో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. భార్య పనికి వెళుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి బీమా సాయం అందలేదు. భార్యకు కనీసం వితంతు పింఛన్ కూడా మంజూరు కాలేదు.
సాక్షి, భీమవరం: బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతామంటూ ఎన్నికల్లో కూటమి నేతలు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక హామీ అమలు చేయకపోగా అసలుకే ఎసరు పెట్టారు. ఇంటి యజమానిని కోల్పోయిన ఆపద వేళ ప్రభుత్వం నుంచి ఆపన్నహస్తం అందక జిల్లాలో ఎన్నో పేద కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఏడాదిగా పత్తాలేని బీమా
బీమా చెల్లింపులు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. గతేడాది జూన్‌లో బీమా సంస్థతో మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) గడువు ముగియగా ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. చంద్రన్న బీమా ప థకం కింద రూ.10 లక్షలు సాయం అందిస్తామని, డ్వాక్రా సంఘాల ద్వారా ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని, కార్మికులకే కాకుండా ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలకు బీమాను వర్తింపజేయనున్నట్టు గతేడాది ఆగస్టులోనే సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటివరకూ కార్యరూ పం దాల్చలేదు. ఏడాదిలో బీమా పరిహారానికి అర్హత కలిగిన కుటుంబాలు జిల్లాలో 500లకు పైనే ఉంటాయని అంచనా. వీరంతా ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
పింఛనూ లేదు : పేద కుటుంబాల్లో భర్త మృతి చెందితే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేస్తారు. గత ప్రభుత్వంలో ఆరు నెలలకోసారి చొ ప్పున జనవరి, జూన్ నెలలో కొత్త పింఛన్లు మంజూ రు చేయడంతో వితంతు పింఛన్లు సకాలంలో అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. గతంలో పింఛన్ పొందుతూ ఎవరైనా మృతిచెందితే వారి భార్యలకు మా త్రమే ఇటీవల స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసింది. అటు బీమా సాయం అందక, ఇటు పింఛన్ రాక భర్త మృతితో ఎంతోమంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన కుటుంబాలకు బీమా సాయం, వితంతు పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చంద్రన్న బీమా అమలెప్పుడో..!
ఆపద వేళ ఆదుకోని కూటమి సర్కారు
పరిహారం రాదు.. పింఛన్ ఇవ్వదు
జిల్లాలో ఇంటి యజమానిని కోల్పోయి దిక్కుతోచని పేద కుటుంబాలు ఎన్నో..
గతంలో వైఎస్సార్ బీమాతో అండగా నిలిచిన జగన్ సర్కార్
ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష సాయం
భార్యకు వితంతు పింఛన్‌తో ఆసరా

పేద బతుకులకు లేదు ధీమా