
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
నరసాపురం: దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్టు రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్‌పాటిల్ తెలిపారు. గురు వారం నరసాపురం రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ఆధు నికీకరణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమృత్ భారత్ పథకంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్‌లో 24 స్టేషన్ల లో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. చైన్నె–విజయవాడ వందేభారత్ రైలును నరసా పురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని, దసరా నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. నరసాపురం–కోటిపల్లి రైల్వే లైన్ ట్రా క్ పనులు సాగుతున్నాయని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పలు స్టేషన్ల అభివృద్ధి, ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. రైళ్లలో చోరీల నివారణకు చర్యలు చేపడతున్నామన్నారు. నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు, విజయవాడ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.