
గళమెత్తిన మున్సిపల్ కార్మికులు
భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు గురువారం సీ ఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కా ర్యాలయం వద్ద ధర్నా చేశారు. యూనియన్ నాయకులు ఎం.వైకుంఠరావు, బి.వరలక్ష్మి మా ట్లాడుతూ గత ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా పట్టించుకోవడం లేదన్నారు. 12వ పీఆర్సీ కమిటీ నియామకం, కార్మికుల జీతాలు పెంపు, సమ్మె కాలానికి జీతాల చెల్లింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
భీమవరం: స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జి ల్లాలోని ఐదు బార్ల కేటాయింపునకు కలెక్టర్ సీహెచ్ నాగరాణి లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 15 బార్ల కేటాయింపు పూర్తయిందని, మిగిలిన 13 బార్లకు రెండో విడత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా ఐదు బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు. వాటిలో భీమవరం ప రిధిలో నాలుగు, నరసాపురం పరిధిలో ఒక బార్‌కు ఒకే అభ్యర్థి నాలుగేసి దరఖాస్తులు వేయడంతో అతనికే ఏకగ్రీవంగా బార్లను కేటాయించినట్టు చెప్పారు. మిగిలిన తాడేపల్లిగూడెంలో నాలుగు, తణుకులో 3, నరసాపురంలో ఒక బార్‌కు మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇన్‌చార్జ్ జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ప్రభుకుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు ప్రసాద్‌రెడ్డి, అజయ్‌కుమార్, సీఐలు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు రెండో రోజు గురువారం కొనసాగాయి. భోజన విరామ సమయంలో జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం డివిజన్లలోని ఉద్యోగులు నిరసన తెలిపి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద భీమవరం డివిజన్ జేఏసీ చైర్మన్ ఏఎన్‌ఎం కృష్ణమూర్తి, కన్వీనర్ ఎం.శ్రీనివాసరాజులు మాట్లాడుతూ జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్, రెగ్యులరైజేషన్, పనికి తగిన వేతనం, డీఏల మంజూరు, ఖాళీల భర్తీ, సబ్‌స్టేషన్లు కాంట్రాక్ట్ ఇవ్వడం ని లుపుదల వంటి 17 డిమాండ్ల పరిష్కారానికి ని రసన కార్యక్రమాలు చేపట్ట్టామన్నారు. శుక్రవా రం సర్కిల్ ఆఫీసులు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామని, 22న ర్యా లీ నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. కృష్ణంరాజు, జి.శ్రీకాంత్, వి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరంలో ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం లంకపేటశాఖ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ నాయకుడు ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూ ముల్లో పేదలకు పట్టాలిస్తామని కూటమి ప్ర భుత్వం చేసిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. గతనెలలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసినా అధికారులు కనీసం విచారణ చే యకపోవడం దారుణమన్నారు. సొంతిల్లు లేక పేదలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు సీహెచ్ వరలక్ష్మి, కొమరగిరి రమేష్, సాయమ్మ పాల్గొన్నారు.

గళమెత్తిన మున్సిపల్ కార్మికులు