
టైలర్లను ఆదుకోవాలి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమం అందజేసింది. టైలర్లు, కుమ్మరులు, రజకులు, ఆటోవారికి, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేశారు. నేటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి టైలర్లకు, చేతివృత్తిదారులకు కూడా సాయం ప్రకటించాలి.
– చింతకాయల సత్యనారాయణ, సీనియర్ టైలర్, తాడేపల్లిగూడెం
గత ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంది. నేటి ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ప్రకటించాలి. నేడు ఆటో కార్మికులకు సంక్షేమం అందజేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో టైలర్లకు కూడా సాయం ప్రకటించాలి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలి
– టి.సుబ్రహ్మణ్యం, టైలర్, తాడేపల్లిగూడెం
గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు రూ.10 వేలు సాయం అందుకున్నాను. ప్రస్తుత ప్రభుత్వం కూడా పేద మహిళా టైలర్లను ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంతవరకు టైలర్ల సంక్షేమానికి ఎలాంటి ప్రకటన చేయలేదు. కార్పోరేట్ శక్తులు కారణంగా మహిళా టైలర్లు చితికిపోతున్నారు.
– ఎస్.కృష్ణవేణి, మహిళా టైలర్, తాడేపల్లిగూడెం

టైలర్లను ఆదుకోవాలి

టైలర్లను ఆదుకోవాలి