
ఆక్వా జోన్ సర్వే పూర్తి చేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఆక్వా జోన్ సర్వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆక్వా జోన్ సర్వేపై జిల్లాలోని మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. అన్ని మండలాల్లో సర్వే పూర్తి చేసి నివేదికలు అందజేస్తామన్నారు. జిల్లాలో 1,32,562.72 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారని, వీటిలో 1,04,792.5 ఎకరాలు మాత్రమే ఆక్వా జోన్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. ముంపు, తక్కువ సారం కలిగిన వ్యవసాయ భూములు, ఆక్వా చెరువుల చుట్టూ వున్న భూముల్లో ఆక్వా సాగు అనుకూలంగా మరో 6,540 ఎకరాలను సర్వేలో గుర్తించారన్నారు.
పోలవరం రూరల్: రెండు నెలలుగా గోదావరి వరద పెరుగుతూ తగ్గుతూ ఒకే విధంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలకు నదిలోకి నీరు చేరడంతో వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం స్పిల్ వే వద్ద 31.6 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. 48 గేట్ల నుంచి 7.69 క్యూసెక్కుల వరద దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం 40 అడుగులకు చేరుకున్నప్పటికీ మంగళవారం సాయంత్రానికి 37.70 అడుగుకుల నీటిమట్టం చేరుకుంది.