
కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు
తాడేపల్లిగూడెం: తాళ్లముదునూరుపాడు, గూడెం పట్టణంలో మంగళవారం వీఽధి కుక్కలు చేసిన దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. ముదునూరుపాడులో రెండు కుక్కలు చేసిన దాడిలో చిన్నారులు గాయపడ్డారు. పెంటపాడుకు చెందిన ఎస్.విజయనాగమల్లేశ్వరరావు, బోడపాడుకు చెందిన బి.దుర్గాప్రసాద్, ముదునూరుపాడుకు చెందిన కే.నరేంద్రరెడ్డి, ఇ.సందీప్, జి.రితీష్, యు.విఘ్నేష్ కల్యాణ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. గూడెం పట్టణంలో మరో కుక్క దాడి చేసిన ఘటనలో జి.సూర్య అనే యువకుడు గాయపడ్డాడు. వీరిని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీధుల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నా మునిసిపల్ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు

కుక్కల దాడిలో ఏడుగురికి గాయాలు