
కుమారుడి మరణం జీర్ణించుకోలేక తల్లి మృతి
చింతలపూడి: కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి మృతి చెందిన ఘటన గురుభట్ల గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చక్రపు వాసు (65) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం వాసు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుమారుడు మరణించడం తెలుసుకున్న వాసు తల్లి శాంతమ్మ(90) తీవ్ర మనోవేదనకు గురైంది. తన కళ్లముందే కుమారుడు మృతి చెందిన విషాదాన్ని జీర్ణించుకోలేక సోమవారం శాంతమ్మ కూడా తనువు చాలించింది. రెండు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు మృతి చెందడంతో గురుభట్లగూడెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

కుమారుడి మరణం జీర్ణించుకోలేక తల్లి మృతి