ఎన్నికల హామీ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీ అమలు చేయాలి

Sep 9 2025 1:14 PM | Updated on Sep 9 2025 1:14 PM

ఎన్ని

ఎన్నికల హామీ అమలు చేయాలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఇమామ్‌లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రూ.10 వేలు, రూ.5 వేల గౌరవ వేతనం అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో వారు కలెక్టర్‌ చదలవాడ నాగరాణిని కలిసి ఈ మేరకు అర్జీని అందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ జహంగీర్‌ మాట్లాడుతూ ఇమామ్‌లు, మౌజన్లకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి

కూటమి ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

ప్రజల నుంచి 192 అర్జీలు

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుంచి 192 అర్జీలు అందాయి. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్‌ కేసీహెచ్‌ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి తదితరులు వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపుగా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు అక్కడే మంచి పరిష్కార మార్గాలు చూపించాలని, అర్జీలు రీఓపెన్‌ ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిపునల్‌ సభ్యుడు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌ వినతి

మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల పునర్నిర్మాణానికి చర్యలు

జిల్లాలోని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో ఆమె డ్వామా, ఇరిగేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో మాట్లా డుతూ తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల పునర్నిర్మాణం చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పనులను ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వీటిలో డీసిల్టింగ్‌, గట్ల పటిష్టత, స్లూయిస్‌, ష్టటర్లు, జంగిల్‌ క్లియరెన్స్‌ తదితర పనులు చేపట్టేందుకు అంచనాలు సిద్ధం చేసి డ్వామా పీడీకీ అందించాలన్నారు. డ్వామా పీడీ డాక్టర్‌ కేసీహెచ్‌ అప్పా రావు, ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు పాల్గొన్నారు.

ఎన్నికల హామీ అమలు చేయాలి 1
1/1

ఎన్నికల హామీ అమలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement