
హీల్ విద్యార్థులకు జాతీయస్థాయిలో పతకాలు
ఆగిరిపల్లి: జాతీయస్థాయిలో నిర్వహించిన పారా అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని తోటపల్లికి చెందిన హీల్ పాఠశాల అంధ విద్యార్థులు పతకాలు సాధించారు. ఆగస్టు 29 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 14వ జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో హీల్ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు జూనియర్స్ విభాగంలో జాలా వరలక్ష్మి డిస్కస్ త్రోలో బంగారు పతాకం, లాంగ్ జంప్‌లో రజిత పతకం, చింతల ప్రవీణ్ పరుగు పందెం పోటీల్లో రజిత పతకం, సబ్ జూనియర్ విభాగంలో హరి లాంగ్ జంప్ , పరుగు పందెం పోటీల్లో రజిత పతకం, రోహిత్ జావాలిన్ త్రోలో రజిత పతకం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యార్లగడ్డ లతా చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను హీల్ సంస్థ సీఈఓ కూరపాటి అజయ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మిక్కిలినేని హరీష్, అంధ పాఠశాల ఇన్‌చార్జి కే అబ్రహం, విద్యార్థులు పాల్గొన్నారు.