ఉద్యోగులు లేరు.. పని చేసేదెవరు? | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు లేరు.. పని చేసేదెవరు?

Jul 22 2025 6:18 AM | Updated on Jul 22 2025 9:19 AM

ఉద్యో

ఉద్యోగులు లేరు.. పని చేసేదెవరు?

ఏలూరు (మెట్రో): ‘అధికారంలోకి వచ్చిన తరువా త ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపుతాం’ ఇవీ గతేడాది ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు పలికిన ప్రగల్భాలు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో నిమగ్నమైంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. జిల్లాలో ప్రజలకు సుపరిపాలన అందాలన్నా.. సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో చేరువ కా వాలన్నా జిల్లా పరిషత్‌ వ్యవస్థ ఎంతో కీలకం. అటు రాజకీయంగా, ఇటు పరిపాలన పరంగా పెనవే సుకుని ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌లో కీలకమైన ఉద్యోగాలన్నీ ఇన్‌చార్జిలతోనే కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్‌లోకి జిల్లా పరిషత్‌ ఉ న్నత పాఠశాలలు, ఎంపీపీ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, ఇంజనీరింగ్‌ సెక్షన్‌లు ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అయినప్పటికీ జిల్లా పరిషత్‌లో వందలాది ఉద్యోగాలు భర్తీకి నోచుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. జిల్లా పరిషత్‌ వ్యవస్థలో ఏలూరులోని జెడ్పీ కార్యాలయంతో పాటు 15 విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. దీనిలో జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని సీఈఓ, డిప్యూటీ ిసీఈఓ ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ కీలకమైన పోస్టులను ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు.

అకౌంట్స్‌ అధికారి కీలకం

ఉమ్మడి జిల్లాకు కీలకమైన అకౌంట్స్‌ అధికారి పోస్టు ఒక్కటే ఉంది. అయితే అదీ ఖాళీగా ఉంది. జిల్లా పరిషత్‌లోని అన్ని విభాగాలకు ఈ అధికారి ద్వారా నే నిధులు బదిలీ అవుతాయి. ప్రతి రూపాయి విడుదల, ఖర్చుకు అకౌంట్స్‌ అధికారి కీలకంగా వ్యవహరిస్తారు. అయితే ఈ పోస్టు ఖాళీగా ఉండటంతో నిధుల ఖర్చు ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ పోస్టు భర్తీపై పాలకులు దృష్టి సారించడం లేదు.

35 మంది ఎంపీడీఓలే..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాల్లో అభివృద్ధి పనులకు ఎంపీడీఓలు కీలకం. అయితే 35 మండలాల్లోనే పూరిస్థాయిలో ఎంపీడీఓలు ఉండగా.. 13 మండలాల్లో లేరు. దీంతో 13 మండలాల్లో ఇన్‌చార్జుల పాలనలో నెట్టుకొస్తున్నారు.

1,600 పోస్టులు.. 662 ఖాళీలు

పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌లో మొత్తం 1,600 పోస్టులకు గాను 938 పోస్టుల్లో మాత్రమే ఉద్యో గులు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ప్రజలకు ఎంతవరకూ సేవలందుతాయనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. త్వరితగతిన పోస్టుల భర్తీ చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

జిల్లా పరిషత్‌లో 662 పోస్టుల ఖాళీ

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కుంటుపడిన పాలన

కీలకమైన అకౌంట్స్‌ అధికారి పోస్టుదీ అదే పరిస్థితి

13 మండలాల్లో ఇన్‌చార్జి ఎంపీడీఓలే..

పట్టించుకోని కూటమి సర్కారు

ఉద్యోగుల ఖాళీలు భారీగానే..

సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్ల పరిస్థితి కూడా అలానే ఉంది. రికార్డు అసిస్టెంట్లు 18 పోస్టులు, లైబ్రరీ అసిస్టెంట్లు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆఫీస్‌ సబార్డినేట్లు 484 పోస్టులకు 65 మంది మాత్రమే పనిచేస్తుండగా 418 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక క్లాస్‌–4 ఉద్యోగులు 185 పోస్టులకు 8 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. క్లాస్‌–4 ఉద్యోగుల పోస్టులు 177 ఖాళీగా ఉన్నాయి.

త్వరలో సమీక్షిస్తా..

జిల్లా పరిషత్‌లో ఖాళీల భర్తీపై త్వరలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం. నూతనంగా నేను బాధ్యతలు తీసుకున్నాను. పరిపాలనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. సమీక్షా సమావేశం ద్వారా తగు నిర్ణయం తీసుకుంటాం.

– ఎం.శ్రీహరి, జెడ్పీ సీఈఓ

ఉద్యోగులు లేరు.. పని చేసేదెవరు? 1
1/1

ఉద్యోగులు లేరు.. పని చేసేదెవరు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement