
మియావాకి పద్ధతిలో మొక్కలు నాటే విధానం
● మొక్కలు నాటాలనుకునే భూమిని ఎక్కువ లోతు తవ్వాలి.
● మొక్కల ఎదుగుదలకు అవసరమైన నాణ్యమైన కంపోస్ట్ ఎరువును సారవంతమైన మట్టితో కలిపి గొయ్యిని పూడ్చాలి.
● స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వృక్ష జాతులను ఎంపిక చేయాలి.
● ఎక్కువ రకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
● మొక్కకు, మొక్కకు ధ్య దూరం లేకుండా దట్టంగా మొక్కలు నాటాలి.
● పక్కనున్న మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడకుండా చిన్న, పెద్ద, మధ్యస్త (ఎత్తు) మొక్కలు ఒకే దగ్గర ఉండేలా రకరకాల వృక్ష జాతులను ఎంపిక చేయాలి.
● ప్రతిరోజూ క్రమం తప్పకుండా డ్రిప్ వంటి పైప్‌ల ద్వారా నీటిని అందించాలి.
మియావాకి పద్ధతితో ప్రయోజనాలివే.
● ఒక్కో ఎకరానికి 4 వేలకు పైగా మొక్కలు నాటవచ్చు.
● చిట్టడవులను తలపించేలా దట్టంగా పెరుగుతాయి.
● జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
● ఈ విధానంతో 30 శాతం ఆక్సిజన్ అందుతుంది.
● 30 రెట్లు త్వరగా మొక్కలు వృద్ధి చెందుతాయి.
● మూడు నుంచి నాలుగేళ్లలోనే 10 రెట్లు పచ్చదనం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది.
● నిర్వహణా వ్యయం చాలా తక్కువ. అలాగే పక్షులు గూళ్లు పెట్టుకోవడానికి వీలుంటుంది