
ప్రజల దృష్టిని మరల్చేందుకే అరకమ కేసులు
యలమంచిలి: ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్‌లు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) విమర్శించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్‌బాబు నాయకత్వంలో యలమంచిలి సెంటర్‌లో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నినాదాలు చేశారు. పార్టీ నాయకులు ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మీ రవికుమార్, చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, చల్లా విశ్వేశ్వరరావు, గుడాల సురేష్, మల్లుల కొండ, వీరా ఉమా శంకర్, నల్లి సంధ్యారాణి, తోట సుబ్బారావు, మోకా నరసింహారావు, పులి వెంకట సుబ్రహ్మణ్యం, మల్లుల బుజ్జి, విప్పర్తి సత్యనారాయణ, కాకుమళ్ల ఆంజనేయులు, దిడ్ల రాజబాబు, వినుకొండ చిన్న, మానుకొండ సోమరాజు, రామేశ్వరపు రఘు, శీలం రామారావు, గాడి దుర్గాప్రసాద్, గుబ్బల వాసు, బుంగా జయరాజు పాల్గొన్నారు.