
అందని సాయం.. అన్నదాత ఆక్రోశం
శురకవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
గత ప్రభుత్వంలో సాగు ఆరంభంలోనే..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సాగు ప్రారంభంలోనే వైఎస్సార్ రైతు భరోసా సాయం విడుదల చేశారు. పీఎం కిసాన్ రూ.6,000లకు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500లు జతచేసి ఏటా రూ. 13,500లు మొత్తాన్ని మూడు విడతలుగా అందించేవారు. తొలి విడతగా మే నెలలోనే రూ. 7,500, తొలకరి చివరిలో రూ.4,000, రబీలో రూ.2,000 చొప్పున అందించారు. ఇలా ఐదేళ్లలో జిల్లాలోని 1,17,999 మందికి రూ.796.49 కోట్ల లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వ సాయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుతం తొలకరి పనులు జోరందుకోవడంతో చేతిలో సొమ్ముల్లేక ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
సాక్షి, భీమవరం: సాగునీటి ఎద్దడి, ఎండలకు నత్తనడకన సాగిన ఖరీఫ్ సాగు అల్పపీడనంతో జోరందుకుంది. జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతులు పనులు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలో పంట పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది అన్నదాత సుఖీభవ సాయానికి ఎసరు పెట్టిన చంద్రబాబు సర్కారు ఈ సీజన్‌లో ఎప్పుడు ఇచ్చేది స్పష్టం చేయడం లేదు.
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో..
జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగనుంది. జూన్ రెండో వారంలో కాలువలకు నీరు విడుదల చేసినా క్లోజర్ పనుల్లో తీవ్ర జాప్యం, సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో పనులు ఆలస్యమయ్యాయి. పలుచోట్ల సాగునీరందక నారుమడులు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల క్రితం నాటికి 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతుండటం తొలకరి పనులకు ఊతమిచ్చినట్టయ్యింది.
రైతులపై రూ.26.18 కోట్ల అదనపు భారం
రైతులకు ఊరటనిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం పక్కన పెట్టిన నీటి తీరువాను కూటమి తెరపైకి తెచ్చింది. పంట పొలాలకు ఎకరానికి ఏడాదికి రూ.350, ఆక్వా చెరువులకు రూ.500 చొప్పున గత మూడేళ్లకు జిల్లాలోని 3,31,169 మంది రైతుల ఖాతాల నుంచి వసూలుకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాత బకాయిలు రూ.5.62 కోట్లు, వడ్డీ రూ.33.77 లక్షలు, ప్రస్తుత డిమాండ్ రూ.15.84 కోట్ల కలిపి రూ. 21.81 కోట్లు వసూలు చేసే పనిలో అధికారులు ఉన్నారు. మరోపక్క మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. ఎకరానికి రూ.210లు చొప్పున తొల కరిలో 2.08 లక్షల ఎకరాలకు రూ.4.37 కోట్లు ప్రీ మియాన్ని ఆగస్టు 15లోపు రైతులు చెల్లించాల్సి ఉంది. సీజన్ ప్రారంభంలోనే నీటితీరువా, బీమా ప్రీ మియం రూపంలో ఖరీఫ్ రైతులపై రూ.26.18 కో ట్ల భారం పడింది. గడిచిన రబీ సీజన్‌లోని ధాన్యం బకాయిలు దాదాపు రూ.290 కోట్లను రెండు నెలలుగా ప్రభుత్వం చెల్లించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాయంపై స్పష్టత ఏదీ ? అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మొదటి ఏడాది సా యానికి ఎగనామం పెట్టారు. ఇలా జిల్లాలోని రైతు లు దాదాపు రూ.210 కోట్లు సాయాన్ని కోల్పో యారు. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నాయి. సాయం విడుదల పేరిట జిల్లాలోని 1.05 లక్షల మంది రైతులకు ఈకేవైసీ పూర్తిచేశారు. కాగా ఎప్పుడు విడుదల చేసేది ప్రకటించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
న్యూస్‌రీల్
అన్నదాత దుఃఖీభవ
వర్షాలతో ఊపందుకున్న తొలకరి పనులు
పెట్టుబడుల కోసం రైతుల ఇక్కట్లు
నీటితీరువా, బీమా ప్రీమియం భారం మోపిన కూటమి సర్కారు
జూలై గడిచిపోతున్నా అన్నదాత సుఖీభవ ఊసెత్తని వైనం
గత ప్రభుత్వంలో పక్కాగా సాయం విడుదల
రైతులంటే చిత్తశుద్ధి లేదు
కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకపోగా ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసింది. మూడేళ్లుగా లేని నీటి తీరువాను పాత బకాయిలతో వసూలు చేస్తోంది. ధాన్యం సొమ్ములకు చాలా ఇబ్బంది పెట్టింది. మూడు నెలల పాటు ధాన్యం డబ్బులు పడక సన్న, చిన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు.
– చిన్నం రామారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, పెనుగొండ

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం

అందని సాయం.. అన్నదాత ఆక్రోశం