
కారుమూరి కాన్వాయ్‌పై దాడి అమానుషం
మావుళ్లమ్మ సన్నిధిలో కలెక్టర్
భీమవరం(ప్రకాశంచౌక్): మావుళ్లమ్మవారిని గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాతృమూర్తితో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
ఏలూరు (టూటౌన్): ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమని, తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్‌ను అడ్డగించి మరీ జనసేన నాయకులు చేసిన వికృత చేష్టలు అమానుషమని వైఎస్సార్‌సీపీ ఏలూరు ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) ఖండించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల వ్యవధిలో నిత్యం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలను టార్గెట్‌గా చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ గతంలో టీడీపీ హ యాంలో ఏర్పాటుచేసినవే అని, అలాంటప్పుడు వైఎస్సార్‌సీపీ హయాంలో అవినీతి ఎలా జరు గుతుందని ప్రశ్నించారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి కాన్వాయ్‌ను అడ్డగించి ప్రచార రథం ఎక్కిన జనసేన నాయకులు దివంగత వైఎస్సార్, మాజీ సీఎం జగన్ ఫొటోలను కాళ్లతో తొక్కడం హేయమన్నారు. సినిమాల పేరుతో రోడ్లను బ్లాక్ చేయడం, ట్రాఫిక్‌కు, సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించడం ఏమిటంటూ నిలదీశారు. జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గుర్నాథ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ నేరుసు చిరంజీవి, ఏలూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, తంగేళ్లమూడి సురేష్, బసవ పాల్గొన్నారు.