
ఆడబిడ్డకు అన్యాయం
రైతులకు నాణ్యమైన నారు
వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలోని పరిశోధన శిక్షణా కేంద్రంలో తయారుచేసిన నారును రైతులకు అందిస్తున్నామని వర్సిటీ వీసీ కె.గోపాల్ తెలిపారు. 8లో u
ఆడ్డబిడ్డ నిధిపై నీలినీడలు
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, భీమవరం: ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్న పేద మహిళల ఆశలపై టీడీపీ ముఖ్య నేత, కీలక మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు నీళ్లు చల్లాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆంధ్రాను అమ్మాలన్న సంచలన వ్యాఖ్యలతో ఆడబిడ్డ నిధి అమలు లేనట్టేనని స్పష్టం చేశారు. ఎంత ఖర్చవుతుందో ఎన్నికలప్పుడు తెలియదా అని కూటమి తీరుపై మహిళలు మండిపడుతున్నారు. అధికారంలోకి రావడమే ఆలస్యం 2024 జూన్ నెల నుంచే 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు పేద మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు జిల్లాలో ఎక్కడకు వచ్చినా ఇదే విషయాన్ని ఊదరగొట్టారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ పేరిట ప్రజలకు పంచిన బాండ్లలో సైతం ఈ పథకం కింద కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌లు పాలన చేపట్టి ఏడాది పూర్తయినా ఈ పథకంపై నోరుమెదపడం లేదు.
తొలి ఏడాది రూ.1073 కోట్ల నష్టం
సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో 7,51,313 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులు 1,26,061 మంది ఉండగా వారిలో మహిళలు 60 శాతం ఉంటారని అంచనా. ఈ మేరకు ఓఏపీ లబ్ధిదారులు 75,636 మంది ఉండగా, వితంతు 49,564, సింగిల్ ఉమెన్ 6,926, అభయహస్తం 8,908, దివ్యాంగులు సుమారు 14000 మంది కలిపి మహిళ లబ్ధిదారులు 1,55,034 మంది ఉన్నారు. వీరిని మినహాయించి కూటమి మేనిఫెస్టో మేరకు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకానికి 5,96,279 మంది అర్హులు ఉంటారని అంచనా. ఈ మేరకు నెలకు రూ. 89.44 కోట్లు చొప్పున గత ఏడాది కాలానికి రూ.1073 కోట్లు మేర ప్రభుత్వ సాయాన్ని ఆడబిడ్డలు నష్టపోయారు.
భార్యను చంపిన భర్త అరెస్టు
చేపల చెరువు అమ్మకానికి భార్య అడ్డుపడుతోందని కక్ష పెంచుకుని హత్య చేసిన భర్తను కలిదిండి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 8లో u
మహిళలకు మేలు చేసిన జగన్ సర్కారు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా పేద మహిళలకు జగన్ సర్కారు అండగా నిలిచింది. ఆసరా కింద జిల్లాలోని 2,70,380 మంది డ్వాక్రా మహిళల రూ.1,107 కోట్ల రుణాలను మాఫీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు బీసీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున జిల్లాలోని సగటున 61,750 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.4 63.41 కోట్ల సాయాన్ని అందించారు. కాపు నేస్తంగా కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలోని సుమారు 28,004 మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.168.02 కోట్లు, ఈబీసీ నేస్తంగా క్షత్రియ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య తదితర ఓసీ సామాజికవర్గాల్లోని 12,827 మంది పేద మహిళలకు గత నాలుగేళ్లలో రూ. 57.71 కోట్ల సాయం అందజేశారు.
న్యూస్‌రీల్
19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ
జిల్లాలో 5.96 లక్షల మందికి అర్హత
గతేడాది రూ.1,073 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో మహిళల్లో ఆందోళన
ఇప్పటికే తల్లికి వందనం కొర్రీలతో నష్టపోయిన మహిళలు
సూపర్ సిక్స్‌లోని హామీని అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు అన్యాయం చేసింది. ఈ హామీని అటకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పథకం అమలుచేయాలంటే ఆంధ్రాను అమ్మాలంటూ.. మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే తల్లికి వందనం అర్హులకు కూటమి ఎగనామం పెట్టింది. జిల్లాలో అర్హులైన విద్యార్థులు 2,29,106 మంది ఉండగా ఇప్పటివరకు 1,87,990 మందికి మాత్రమే సాయం జమచేసింది. ఒక్కో విద్యార్థికి రూ.13 వేలకు గాను కొందరికి రాష్ట్ర వాటాగా రూ. 8500 నుంచి రూ.9000 మాత్రమే ఇచ్చింది. కేంద్రం వాటా త్వరలో జమవుతుందని మెసేజ్‌లు పంపి చేతులు దులుపుకుంది. ఆడబిడ్డ నిధి పట్టాలెక్కించుకుండానే పక్కనపెట్టే వ్యాఖ్యలపై మహిళలు భగ్గుమంటున్నారు. ఎంత ఖర్చవుతుంది? పథకం అమలుకు ఆదాయ వనరులు ఏమిటి? అనే విషయం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ముందు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఆడబిడ్డకు అన్యాయం

ఆడబిడ్డకు అన్యాయం