ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు మాటలు వింటుంటే పఽథకం అమలు చేయరని అర్ధమైపోయింది. ఎన్నికల్లో మహిళలకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేయడం ప్రభుత్వానికి తగదు.
– కావలి రామసీత, కౌన్సిలర్, నరసాపురం
మోసం చేయడం టీడీపీకి అలవాటే
హామీలు ఇచ్చి మోసం చేయడం టీడీపీకి, చంద్రబాబునాయుడికి అలవాటే. ఆడవారికి పథకాలు ఇవ్వాలంటే చేతులు రావడం లేదు. ఆడబిడ్డ నిధి రూ.1500 ప్రకటించి 13 నెలలుగా అమలు ఊసేలేదు. ఇప్పుడు ఇస్తారో లేదో వారికే తెలియడం లేదు.
– పోతంశెట్టి లక్ష్మి, పెంటపాడు
ఏ హామీనీ అమలు చేయడం లేదు
ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పారు. అధికారం చేపట్టి 14 నెలలు కావొస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయలేదు.
– బుడితి శ్రీలత, అత్తిలి
హామీలు అమలు చేయకపోతే దిగిపోవాలి
మాటపై నిలబడి తత్వం కూటమి ప్రభుత్వానికి లేదు. హామీలకు కరపత్రాలు, గ్యారంటీ బాండ్లు పంపిణీ చేశారు. మహిళలను మోసం చేయడానికే రూ.1500 ఆడబిడ్డ నిధి అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు.ఇచ్చిన హామీల అమలు చేతకాకపోతే దిగిపోవాలి.
– రావూరి వెంకటరమణ, మాజీ ఎంపీపీ, యలమంచిలి
●
మహిళలను మోసం చేయడం తగదు
మహిళలను మోసం చేయడం తగదు
మహిళలను మోసం చేయడం తగదు