
బీసీ మహిళపై కూటమి నేతల వేధింపులు
పెనుగొండ: కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీసీ మహిళా సర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేయడం అన్యాయమని వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. పోడూరు మండలం పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక చెక్ పవర్ పునరుద్ధరించాలంటూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులకు విలువ నివ్వకుండా గ్రామాల్లో కూటమి నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సైతం కనీసం సర్పంచ్‌కు తెలియనివ్వకుండా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.
కన్నీరు పెట్టుకొన్న బీసీ మహిళా సర్పంచ్
కక్ష సాధింపులో భాగంగానే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ చెక్ పవర్ రద్దు చేశారని పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక కన్నీరు పెట్టుకొన్నారు. పండిత విల్లూరు కనీసం పంచాయతీ సభ్యుడు కాని గణపతినీడి రాంబాబు తనను కించపరుస్తూ సర్పంచ్ కుర్చీలో కూర్చోని పెత్తంన చెలాయిస్తున్నారన్నారు. అహంకారంతో శ్రీప్రభుత్వం మాది.. మా మాటే వేదవాక్కుశ్రీ అంటూ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. ప్రశ్నించినందుకు ఆరోపణలు చేసి, అధికారులపై ఒత్తిడి తెచ్చి తన చెక్‌పవర్ రద్దు చేయించారన్నారు. బీసీ మహిళా సర్పంచ్ అని చూడకుండా స్థానిక ఎమ్మెల్యే పితాని దీనికి వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే పోరాటం తప్పదని వైఎస్సార్ సీపీ నాయకులు హెచ్చరించారు. నిరసనలో జెడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణి, ఆచంట, పోడూరు మండల సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్, గుబ్బల ఉషారాణి వీరబ్రహ్మం, సర్పంచ్‌లు మట్టాకుమారి, బుర్రా రవికుమార్, చుట్టగుళ్ల పూర్ణిమ, గొట్టుముక్కల సోనీయా, నామన వీర్రాజు, తమనంపూడి వీర్రేడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, మండల కన్వీనర్లు పిల్లి నాగన్న, నల్లిమిల్లి వేణుబాబు, కర్రి వేణుబాబు, చింతపల్లి గురుప్రసాద్, గెద్దాడ ఏకలవ్య, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కక్ష సాధింపులతో సర్పంచ్ చెక్ పవర్ రద్దు
వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన