
ప్లాస్టిక్‌రహిత జిల్లా లక్ష్యం
అత్తిలి: జిల్లాను ప్లాస్టిక్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దాల ని జిల్లా ప్రత్యేక అధికారి, మహిళలు, పిల్లలు, విక లాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. శనివారం తణుకు మాంటిస్సోరి హైస్కూల్, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి ఆమె హాజరయ్యారు. మానవాళి మనుగడకు ప్లాస్టిక్‌ను నిర్మూలించడం అవసరమని, అందరూ జ్యూట్ బ్యాగులు వాడాలని సూర్యకుమారి సూచించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన, జ్యూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రదర్శనలో విజేతలకు ప్రశంసా ప త్రాలను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, తహసీల్దార్ డీవీఎస్‌ఎస్ అశోక్‌వర్మ, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎంపీడీఓ లోహిత్ సాగర్, పాఠశాల హెచ్‌ఎం ఎస్.లక్ష్మి, ప్రిన్సిపాల్ ఏ.జ్ఞాన మంజరి, డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు పాల్గొన్నారు.