
చట్ట పరిధిలో పరిష్కారం
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోపు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త, అత్తింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఆస్తి తగాదాలు వంటి సమస్యలపై 10 అర్జీలు స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి
పాలకొల్లు సెంట్రల్: విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేవీఎన్ గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కొబ్బరి వర్తకుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు అదానీ మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు. వీటి వల్ల బిల్లులు 2, 3 రెట్లు పెరగడమే కాకుండా, టైం ఆఫ్ స్కేల్ ద్వారా ప్రజలపై భారం పడుతుంద న్నారు. ముందస్తుగా బిల్లు కట్టి కరెంట్ కొనుక్కోవడం వల్ల ప్రజలు ఆర్థిక కష్టాలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలు కొట్టండని పిలుపునిచ్చిన లోకేష్ అధికారం చేపట్టిన తర్వాత బిగించడని చెప్పడం ఏరు దాటిన తరువాత తెప్ప తగలెయడమేనని విమర్శించారు.
ఎకరాకు 56 కిలోల ఎరువులు అవసరం
తాడేపల్లిగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయంలో అధికంగా ఎరువులు వినియోగిస్తుంటారని, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వైపు వెళితే ఇంత పెద్ద మొత్తంలో ఎరువులు వాడక్కరలేదని వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో సోమవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డాక్టర్ విజయ లక్ష్మి అన్నారు. వరిలో అత్యఽధికంగా రసాయన ఎరువులు వినియోగించే జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలే అన్నారు. గోదావరి జిల్లాల్లో 164 కిలోలు వాడుతున్నారని, అయితే ఎకరాకు కావాల్సింది కేవలం 56 కిలోల ఎరువులు మాత్రమే అన్నారు. సేంద్రియ పద్ధతిలో వరికి అవసరమైన వాటిని వాడాలన్నారు. డ్రోన్ ద్వారా జీవామృతం పిచికారీపై వివరించారు. ప్రకాశరావుపాలెం, చోడవరం రైతులకు అవగాహన కల్పించారు.
టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర తండ్రి బసవ పున్నయ్యపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి పా మాయిల్ గెలలను అపహరించడం ఘర్షణకు దారి తీసింది. సోమవారం కొప్పులవారిగూడెంలో తన పొలంలో పామాయిల్ గెలలను కో సుకుని ఫ్యాక్టరికి తీసుకువెళుతుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి ఐదు టన్నుల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకువెళ్లారని బాధితుడు బసవ పున్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమ కుటుంబాన్ని అన్నిరకాలుగా నష్టపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వాపోయారు. దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. బసవ పున్నయ్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జరిగిన సంఘటనపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్, అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావులతో ఫోన్ లో మాట్లాడారు.
మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగింపు
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం ము న్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన హా మీలను అమలు చేయడంలో దాటవేత ధోరణి అవలంబించడంపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.సోమయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జీ తాలు మొక్కుబడిగా పెంచడం గర్హనీయమని విమర్శించారు. కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం కోసం మంగళవారం కూడా సమ్మెను కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు.