
ఫేస్ యాప్‌పై అంగన్‌వాడీల గళం
పెంటపాడు: అంగన్‌వాడీ పథకంలో టీచర్లకు, లబ్ధిదారులకు ఆటకంగా ఉన్న ఫేస్ రికగ్నైజ్‌డ్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను కూటమి ప్రభుత్వం తక్షణం రద్దుచేయాలని కోరుతూ అంగన్‌వాడీలు, గర్భిణులు, బాలింతలు చిన్నారులలో కలిసి సోమ వారం నిరసన చేపట్టారు. ప్రత్తిపాడులో ధర్నాకు ది గారు. ఐసీడీఎస్ సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు జె.శ్యామల, జి.దీనాలు మాట్లాడుతూ పోషణ కిట్‌ల పంపిణీకి ఓటీపీ ద్వారా కేవైసీ నిబంధన సరికాదన్నారు. కొన్నిచోట్ల సిగ్నల్ సమస్యతో సరుకుల పంపిణీలో ఇబ్బంది పడుతున్నామన్నారు. రాబో యే రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు గ్గిపోయే ప్రమాదముందని, యాప్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు.
పెనుమంట్రలో..
పెనుమంట్ర: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్‌వాడీ సరుకులు పొందడానికి ఆంటకాలా అంటూ పెనుమంట్ర ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేసి వినతిపత్రం అందించారు. ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, ఆన్‌లైన్ పద్ధతిని రద్దు చేయాలని, తేలికగా లబ్ధిదారులు సరుకులు పొందడానికి అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. సీఐటీయూ మండల నాయకుడు కోడి శ్రీనివాసప్రసాద్ మద్దతు తెలిపారు. జిల్లా నాయకురాలు కానూరు తులసి తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ యాప్‌పై అంగన్‌వాడీల గళం