
మదినిండా పెద్దాయనే..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ముఖ్యమంత్రిగా, ప్రజానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ఇప్పటికీ ప్రజల హదయాల్లో పదిలమే. అందుకే ఆయన్ను రాష్ట్రమంతా పెద్దాయనగా పిలుచుకుంటుంది. ఆ మహానీయుడి జయంతి సందర్భంగా నగరానికి చెందిన మైక్రో ఆర్టిస్టులు తమ కళ ద్వారా వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఏలూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ ప్రసాద్ వైఎస్ చిత్రపటాన్ని రావి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకోగా, మరో మైక్రో ఆర్టిస్ట్ మేతర సురేష్ అగ్గిపుల్లపై వైఎస్ చిత్రాన్ని చిత్రించి కృతజ్ఞత చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు కృషి చేసిన మహామనిషి వైఎస్సార్ అని మైక్రో ఆర్టిస్టులూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కుమార్తె అదృశ్యంపై పిర్యాదు
ముదినేపల్లి రూరల్: కుమార్తె అదృశ్యంపై ఆమె తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ శంకరరావు తెలిపారు. మండలంలోని చిగురుకోట శివారు నరసన్నపాలెంకు చెందిన మహిళ తన కుమార్తె పదో తరగతి వరకు చదువుకుని కూలి పనులకు వెళుతుందని, సోమవారం తెల్లవారుజాము నుంచి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.