
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యలమంచిలి: లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి చెందాడు. వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన మేడిచర్ల పూర్ణచంద్ర ఉదయభాస్కర్ (64) తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం చించినాడ వచ్చి తిరిగి బైక్‌పై వెళ్తుండగా చించినాడ వశిష్ట గోదావరి నది వంతెనపై సిమెంట్ లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు.
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
భీమవరం (ప్రకాశంచౌక్): రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ టీఆర్‌ఎస్ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి వర్షాకాలం సీజన్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, తుపానులను సమర్థవంతం ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు.
క్షీరారామంలో ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవారం ప్రదక్షిణలకు భక్తులు పోటెత్తారు. సోమవారం ప్రదోషకాలంలో భక్తులు ప్రదక్షిణలు ప్రారంభించారు. ఏడు మారేడు దళాలు చేత పట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేసి దీపాలంకరణ వెలుతురులో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి పంచహారతులు నిర్వహించారు. దాతలు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, అర్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హత్య కేసులో 8 మంది అరెస్ట్
దెందులూరు: మండలంలోని వీరభద్రపురం వద్ద ఇటీవల జరిగిన హత్య కేసులో 8 మందిని పెదవేగి సీఐ రాజశేఖర్ అరెస్ట్ చేసినట్లు దెందులూరు ఎస్సై ఆర్ శివాజీ తెలిపారు. 8 మంది నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపరచుగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం