
స్నాతకోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం
తాడేపల్లిగూడెం: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కె.గోపాల్ రాజ్‌భవన్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 10న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూర్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో నిర్వహించనున్న ఉద్యానవర్సిటీ ఆరో స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఉద్యాన వర్సిటీ సాధించిన ప్రగతిని వీసీ గవర్నర్‌కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు ఉన్నారు.
పార్సిల్ కార్యాలయాల తనిఖీ
తాడేపల్లిగూడెం: పట్టణంలోని పార్సిల్ కార్యాలయాలను శుక్రవారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ పార్సిల్స్ ద్వారా స్పిరిట్, గంజాయి, డ్రగ్స్ వంటివి తరలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్సిల్ కార్యాలయాలు, కొరియర్ కార్యాలయాలు చట్ట విరుద్ధమైన వస్తువులు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఆర్‌ఎంటీ, నవత, వీఆర్‌ఎల్ లాజిస్టిక్ , బ్లూడార్ట్, ఆర్టీసీ, రైల్వే పార్సిల్ కార్యాలయాలు, డీటీడీసి, ప్రొఫెషనల్ కొరియర్ సర్వీసుల కార్యాలయాలను, గోదాములను తనిఖీ చేశారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: చేపల పట్టుబడికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెదగొన్నూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎ.హేమంతరావు ఈ నెల 1న చేపల పట్టుబడికి వెళ్లి ప్రమాదవశాత్తూ తల తిరిగి జారిపడిపోయాడు. చికిత్స నిమిత్తం పెదఅవుటుపల్లి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గురువారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికి త్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడి భార్య రాఘవమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

స్నాతకోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం