‘జగనన్న ప్రగతి పథం’కు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

‘జగనన్న ప్రగతి పథం’కు తరలిరండి

Nov 17 2023 12:58 AM | Updated on Nov 17 2023 12:58 AM

- - Sakshi

భీమవరం(ప్రకాశం చౌక్‌): రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ ఈనెల 18న విజయవాడలో తలపెట్టిన జగనన్న ప్రగతి పథం ర్యాలీ విజయవంతం చేసేందుకు ఐటీ ఉద్యోగులు తరలిరావాలని ఐటీ వింగ్‌ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జోనల్‌ ఇన్‌చార్జి సవరం కిషోర్‌ పిలుపునిచ్చారు. గురువారం భీమవరంలో జగనన్న ప్రగతిపథం పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు ర్యాలీకి హాజరుకానున్నారని, ఐటీ వింగ్‌ చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని శాసనమండలి చైర్మన్‌, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజవర్గ ఇన్‌ చార్జిలు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారు. గత టీడీపీ పాలనలో జరగని.. ప్రస్తుతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ చేపట్టామన్నారు. ఈనెల 18న 50 కార్లలో ర్యాలీగా తూర్పుగోదావరి జిల్లా నుంచి బయలుదేరి పశ్చిమగోదావరి జిల్లా మీదుగా విజయవాడ చేరుకుంటామన్నారు. విజయవాడలోని బందరు రోడ్డులో ర్యాలీ ప్రారంభించి బస్టాండ్‌ సమీపంలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద ర్యాలీ పూర్తవుతుందన్నారు. ర్యాలీని ఐటీ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూసంరెడ్డి సునీల్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు సుమంత్‌ గుద్డటి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ పడాల కిషోర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శలు కిషోర్‌బాబు, నానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement