
ఎస్‌జీఎఫ్ పోటీలు
స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17 సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ జిల్లాస్థాయి పోటీలు పెదవేగిలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 8లో u
కలెక్టర్ ప్రశాంతి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో రీసర్వే లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. విజయవాడ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి గురువారం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, రీ సర్వే తదితర అంశాలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో రీ సర్వేలో భాగంగా మొదటి విడతలో స్టోన్ ప్లాంటేషన్ పూర్తికాగా, రెండో విడతలో గ్రౌండ్ ట్రూత్‌నింగ్, ఇతర ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే మూడో విడతలో రీసర్వే ప్రక్రియ మొదలుకాగా, జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో వేగంగా రీ సర్వే పనులను చేపట్టి సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.