కౌలుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

కౌలుకు భరోసా

Sep 22 2023 12:40 AM | Updated on Sep 22 2023 12:40 AM

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందిస్తున్న అధికారులు  - Sakshi

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందిస్తున్న అధికారులు

శురకవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2023

ఏలూరు (మెట్రో): అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా.. వ్యవసాయాన్ని పండుగ చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోంది. రైతులతో పాటు కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా పంట సాగుదారు హక్కు చట్టం–2019 ద్వారా రైతులతో సమానంగా సంక్షేమ పథకాలు, రాయితీలు అందిస్తోంది. కౌలు రైతులకు అందించే పంట సాగుదారు హక్కు పత్రాలను లక్ష్యానికి మించి పంపిణీ చేస్తూ వారి సంక్షేమానికి కూడా పాటుపడుతోంది.

ఎన్నడూ లేనివిధంగా..

గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామాల్లోనే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సకల సౌకర్యాలు కల్పిస్తోంది. అలాగే కౌలు రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా భూ యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారులకు నిర్ణీత కాల వ్యవధిలో పండిన పంటలపై మాత్రమే హక్కు కల్పిస్తూ పంట సాగుదారు హక్కు చట్టం ద్వారా రాయితీలు అందిస్తోంది. కౌలు రైతుల పాలిట వరంగా మారిన ఈ విధానాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా అమలు చేయలేదు. గత ప్రభుత్వాలు కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయి. పాలకులకు అనుకూలంగా వ్యవహరించే వారికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశాయి. దీంతో అసలైన కౌలు రైతులకు తీవ్ర నష్టం జరిగేది. అయితే దీనికి భిన్నంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భూమి లేని సన్న, చిన్నకారు, నిరుపేద కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు సైతం పంట సాగుదారు హక్కుపత్రాలు జారీ చేస్తూ అన్నింటా అండగా నిలుస్తోంది.

103.58 శాతంతో.. ఏలూరు జిల్లాలో 2023–24లో లక్ష్యానికి మించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 56,433 మంది కౌలు రైతులకు పత్రాలు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించగా 58,456 మందికి అందజేసి 103.58 శాతాన్ని నమోదు చేసుకుంది. వీరిలో అర్హులైన 11,676 మంది కౌలు రైతులకు రూ.8.75 కోట్ల పెట్టుబడి సాయంగా వారి ఖాతాల్లో జమ చేశారు. అలాగే 12,844 మంది కౌలు రైతులకు రూ.51.33 కోట్లు పంట రుణాలను బ్యాంకుల ద్వారా జిల్లా అధికారులు ఇప్పించారు. అర్హుల జాబితాలను సైతం ఆయా సర్వీసు ఏరియా బ్యాంకులకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పంపించారు. గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్క కౌలు రైతుకు రైతులతో సమానంగా సహాయం అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

న్యూస్‌రీల్‌

‘కౌలు’కునేలా సాయం

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

విరివిగా పంట రుణాలు

కార్డుల ద్వారా పెట్టుబడి సాయం అందజేత

2023–24లో లక్ష్యానికి మించి పంపిణీ

కౌలు గుర్తింపు

కార్డుల అందజేత

58,456

కౌలు గుర్తింపు

కార్డుల లక్ష్యం

56,433

పంట రుణాల మంజూరు 12,844 మందికి

రూ. 51.33 కోట్లు

పెట్టుబడి సాయం

11,676 మందికి

రూ. 8.75 కోట్లు

అర్హులందరికీ కార్డులు

జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ కౌలు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. కౌలు రైతులు ఏ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులతో సమానంగా వారికీ సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు.

– బి.లావణ్యవేణి, జాయింట్‌ కలెక్టర్‌, ఏలూరు

సాధిక్‌ హుస్సేన్‌ 
జోనల్‌ ఇన్‌చార్జి  1
1/3

సాధిక్‌ హుస్సేన్‌ జోనల్‌ ఇన్‌చార్జి

బడుగు అశోక్‌బాబు 
జిల్లా అధ్యక్షుడు2
2/3

బడుగు అశోక్‌బాబు జిల్లా అధ్యక్షుడు

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement