
చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ తదితరులు
సాక్షి, భీమవరం: జిల్లా చెస్ అసోసియేషన్, అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 24న భీమవరంలో అండర్–13 జిల్లా స్థాయి ఓపెన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ గురువారం చెప్పారు. అనసూయ చెస్ అకాడమీలో ఆదివారం ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2010 జనవరి తరువాత జన్మించి ఉండాలన్నారు. విజేతలు విజయనగరంలో అక్టోబర్ 19 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్ధాయి ఫైడ్ రేటెడ్ అండర్–13 ఓపెన్ చెస్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వివరాల కోసం 90632 24466 నెంబర్‌కు సంప్రదించాలని కిషోర్ తెలిపారు.
యర్రంశెట్టివారిపాలెంలో చోరీలు
నరసాపురం రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్రంశెట్టివారి పాలెంలో మూడు చోరీలు జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం ఒకే రోజున వేర్వేరు ఇళ్లలో ఈ దొంగతనాలు జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇవి జరిగాయని నిర్ధారించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు యర్రంశెట్టివారి పాలెం గ్రామానికి చెందిన కూనపరెడ్డి కృష్ణ ఇంట్లో 8 కాసుల బంగారు ఆభరణాలతోపాటు లక్ష రూపాయల నగదు, మల్లిపూడి కుమారి బీరువాలోని బంగారు చెవిదిద్దులు, నగదుతోపాటు ఇంటి అరుగుపై నిద్రిస్తున్న కూనపరెడ్డి బేబీరామానుజమ్మ మెడలో ఐదుకాసుల సూత్రాల తాడు చోరీకి గురైన ఫిర్యాదు అందింది. చోరీ జరిగిన ఇళ్లను డీఎస్పీ రవిమనోహరచారి, సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఏజీఎస్ మూర్తిలు పరిశీలించారు.