
నరసాపురం మెయిన్‌రోడ్డులో వర్షపు నీరు
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు మండలంలో 68.4 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం.. నరసాపురంలో 43.8. కాళ్లలో 43.2, భీమవరంలో 40.2, ఉండిలో 39.2, ఆకివీడులో 37.6, వీరవాసరంలో 26.2, పాలకొల్లులో 18.4, తణుకులో 15.4, ఇరగవరంలో 15.2, ఆచంటలో 15.2, పెంటపాడులో 14.2, తాడేపల్లిగూడెంలో 14, పాలకోడేరులో 13.4, గణపవరంలో 12.4, యలమంచిలిలో 11.4, పెనుమంట్రలో 9.4, పెనుగొండలో 8.6, అత్తిలిలో 8.4, పోడూరులో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నరసాపురంలో..
నరసాపురం: పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి రెండు గంటలపాటు ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్టీమర్ రోడ్డు, ప్రకాశం రోడ్డు, చేపలమార్కెట్ ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు నిల్వ ఉండిపోయింది. బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పుట్‌ఫాత్‌లపై చిరు వ్యాపారులు బేరాలులేక అవస్థలు ఎదుర్కొన్నారు.
తానా సాహితీ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రమావతి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, నారీ సాహిత్య భేరి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న అంతర్జాల అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ అంతర్జాల సాహితీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం నుంచి శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సాహిత్య సమావేశంలో 15 దేశాల నుంచి తెలుగు కవయిత్రులు పాల్గొననున్నారు. విశిష్ట అతిథిగా ఆహ్వానించిన తానా అంతర్జాతీయ సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
