
జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్న యువత
పెదవేగి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 14, 17 సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు పెదవేగి డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రారంభించారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కే.జయరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగే ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 300 మంది ఈ పోటీలలో పాల్గొన్నారని తెలిపారు.
క్రమం తప్పని వ్యాయామంతో మతిమరుపునకు చెక్
తణుకు టౌన్: క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం ద్వారా మతిమరుపు (అల్జీమర్స్) నుంచి బయటపడవచ్చని ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ కె.ఆనంద్ చెప్పారు. గురువారం సాయంత్రం ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా తణుకు బ్యాంక్ కాలనీలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జ్ఞాకపశక్తిని పెంచే ఆటలను వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి కేవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి ఆర్‌జీ భాస్కరరావు, అక్కిన బాపినీడు, ఏ సుబ్రహ్మణ్యం, వెంకటరెడ్డి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఆదేశాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న జీతాల బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సమగ్రశిక్ష అభియాన్‌లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న సుమారు 25 వేల మంది ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందడంలేదని.. వెంటనే జీతాలు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వర రావు, షేక్ సాబ్జీ గురువారం వినతిపత్రం సమర్పించారు. వివరాలను ఎస్‌ఎస్‌ఏ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసా శ్రీనివాస రావు పత్రికలకు విడుదల