ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్‌పేటలో ఉంటున్న ఒక విద్యార్థిని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. కూలి పనులు చేసుకునే కాళిదాసు జోజిబాబుకు ముగ్గురు కుమార్తెలు.. చిన్న కుమార్తె కాళిదాసు హెప్సిబా (15) పదో తరగతి చదువుతుంది. కుటుంబ సభ్యులు గురువారం ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ కోమాకుల శివాజీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి ఏలూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.