
అధికారులు స్వాధీనం చేసుకున్న పొగాకు బేళ్ల వ్యాన్
కొయ్యలగూడెం: అక్రమంగా తరలిస్తున్న వర్జీనియా పొగాకు బేళ్ల వ్యానును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 28వ తేదీ రాత్రి కొయ్యలగూడెం మండలం సరిపల్లి నుంచి ఓ వ్యక్తి పొగాకు బేళ్లను రవాణా చేస్తుండగా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు కామవరపుకోట ఆడమిల్లి సమీపంలో తొమ్మిది పొగాకు బేళ్లతో ఉన్న వ్యానును స్వాధీనం చేసుకున్నారు. వ్యానును కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి వివరాలు తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.